Begin typing your search above and press return to search.
తలపండిన ఆ నేతను ఏపీ 3 రాజధానుల గురించి అడిగితే?
By: Tupaki Desk | 24 Sept 2020 2:40 PM ISTకేరళ రాష్ట్రానికి రెండు దఫాలు ముఖ్యమంత్రిగా వ్యవహరించటం.. విపక్ష నేత.. మంత్రి.. ఇలాంటి పదవులెన్నో చేపట్టారు ఊమెన్ చాందీ. ప్రజాజీవితంలోకి ఆయన అడుగు పెట్టి యాభై ఏళ్లు అయిన సందర్భంగా ఆయన ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గ ప్రజలు స్వర్ణోత్సవాల్ని ఘనంగా నిర్వహించటం దేశ వ్యాప్తంగా ఆసక్తికర పరిణామంగా మారింది. దేశంలో మరే రాజకీయ నేతకు లేని రికార్డు ఆయన సొంతం.
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి పదకొండు దఫాలుగా ఎన్నికైన కిరాక్ రికార్డు ఆయన సొంతం. రాజకీయాల్లో తలపండిన ఆయన తాజాగా తెలుగు రాజకీయ పరిణామాల్ని సమీక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున హైదరాబాద్ కు వచ్చారు. ఈ సందర్భంగా ఏపీ అధికారపక్షం మూడు రాజధానుల ప్రతిపాదనపై ఆయన స్పందనను అడిగే ప్రయత్నం చేసింది మీడియా.
దీనికి ఆయన స్పందించిన తీరు ఆసక్తికరంగా మారింది. ఏపీలోని మూడు రాజధానులపై కాంగ్రెస్ పార్టీలో లోతుగా చర్చించామని..ఈ అంశంపై పీసీసీ స్పందిస్తుందని పేర్కొన్నారు. ఆయన మాటల్ని వింటే.. ఏ విషయానికి స్పందించాలి? ఏ విషయంలో మాటను తప్పించాలన్న విషయంలో తల పండిపోయిన తీరు ఇట్టే అర్థమవుతుంది. ఈ కారణంతోనే కావొచ్చు.. పదకొండుసార్లు నాన్ స్టాప్ గా విజయాన్ని సాధించారని చెప్పాలి.