Begin typing your search above and press return to search.

5ల‌క్ష‌ల‌కు పైగా ఆదాయం ఉంది 76 ల‌క్ష‌ల‌మందికే

By:  Tupaki Desk   |   1 Feb 2017 2:06 PM GMT
5ల‌క్ష‌ల‌కు పైగా ఆదాయం ఉంది 76 ల‌క్ష‌ల‌మందికే
X
కేంద్ర బడ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన సంద‌ర్భంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అనేక ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యాలు వెల్ల‌డించారు. ముఖ్యంగా ఇన్ క‌మ్ టాక్స్ క‌ట్టే వారి గురించి జైట్లీ చెప్పిన లెక్క‌లు ఒకింత షాక్ కొట్టే విధంగానే ఉన్నాయి. దేశంలోని దాదాపు 107 కోట్ల మందిలో ఐటీ దాఖ‌లు చేసే వారి సంఖ్య స్వ‌ల్పం అనుకుంటే అతికొద్ది మంది అంటే అందులో రూ.5ల‌క్ష‌ల కంటే ఎక్కువ మొత్తం ఆదాయం ఉన్న వారు దేశంలో మొత్తంగా 76 ల‌క్ష‌ల మందేన‌ట‌. ఈ విష‌యం స్వ‌యంగా జైట్లీ వెల్ల‌డించారు. ఇక రూ. 10 లక్షల ఆదాయం చూపిస్తున్నవారి సంఖ్య 20 లక్షల లోపేన‌ని జైట్లీ వివ‌రించారు. 24 లక్షల మంది రూ. 10 లక్షలపై ఆదాయాన్ని చూపిస్తున్నారని జైట్లీ తెలిపారు.

జైట్లీ పార్ల‌మెంటులో తెలిపిన వివ‌రాల ప్ర‌కారం దేశంలో వ్యక్తిగతంగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్న వారి సంఖ్య 1.74 కోట్ల మంది ఉండ‌గా....అందులో రూ. 50 లక్షలకు పైగా ఆదాయం ఆర్జిస్తున్నామని ఐటీ రిట‌ర్న్స్ దాఖ‌లు చేసిన‌ వారి సంఖ్య 1.72 లక్షలు మాత్రమే. ఇక రూ. 10 లక్షల ఆదాయం చూపిస్తున్నవారు 20 లక్షల లోపు మాత్ర‌మే ఉన్నారు. 24 లక్షల మంది రూ. 10 లక్షలపై ఆదాయాన్ని చూపిస్తున్నారని జైట్లీ పార్ల‌మెంటుకు తెలిపారు. ఇక ప‌న్ను ప‌రిధిలోకి రాని రూ. 2.5 లక్షల వార్షికాదాయం ఉన్నవారు 99 లక్షల మంది మాత్ర‌మే. మ‌రోవైపు 4.2 కోట్ల మంది వేతన సిబ్బంది ఉన్నారని జైట్లీ వివ‌రించారు.

ఇదిలాఉండ‌గా...ప్ర‌తి ఆదాయం ప‌న్నుదారుడు చెల్లించే ప‌న్నును తగ్గించామ‌ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. లోక్‌స‌భ‌లో బ‌డ్జెట్ ప్ర‌వేశపెట్టిన త‌ర్వాత ఆయ‌న టీవీ కార్య‌క్ర‌మంలో మాట్లాడారు. దేశ చ‌రిత్ర‌లో ప్ర‌తి ప‌న్నుదారుడిపై ప‌డే ప‌న్ను భారాన్ని త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకున్న తొలి బ‌డ్జెట్ ఇదే అని ఆయ‌న అన్నారు. పేద‌ల చేతుల్లో న‌గ‌దు ఆదాయం ఉండాల‌ని, ఆ బాధ్యత ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు చూసుకోవాల‌న్నారు. ప‌న్ను ఎగవేస్తున్న వారిని ప‌న్ను ప‌త్రాలు స‌మ‌ర్పించే విధంగా చేసేందుకు ప్ర‌య‌త్నించిన‌ట్లు మంత్రి తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/