Begin typing your search above and press return to search.

ఇండియాలో ఇంటర్నెట్ వాడేవారు ఎంతమంది.?

By:  Tupaki Desk   |   8 Aug 2018 8:43 AM GMT
ఇండియాలో ఇంటర్నెట్ వాడేవారు ఎంతమంది.?
X
27 కోట్ల జనాభా ఉన్న అమెరికాలో దాదాపు 90శాతం మంది ఇంటర్నెట్ ను వాళ్ల నిత్యజీవితంలో విరివిగా వాడుతున్నారు. అదే 120 కోట్లకు పైగా ఉన్నభారత జనాభాలో ఎంతమంది ఇంటర్నెట్ ను రోజూ వాడుతుండాలి.. లెక్కేయండి..కనీసం సగం జనాభా అయినా వాడుతుంటారని మీరు అనుకుంటున్నారా.? కానీ మీరు తప్పులో కాలేసినట్టే..

ఇటీవల ఐసీటీ అక్సెస్ అనే సంస్థ భారత్ లో ఇంటర్నెట్ ను రోజూ వాడే వారిపై ఓ సర్వే నిర్వహించింది. ఇందులో 15 నుంచి 65 ఏళ్ల మధ్యనున్న వారిపై పరిశోధించింది. ఇందులో ఇండియాలో ప్రతిరోజు ఇంటర్నెట్ ను వాడే వారు కేవలం 19శాతం మాత్రమేనని తేల్చారు.

ప్రస్తుతం జియో యుగం నడుస్తోంది. 4జీ టెక్నాలజీ దేశంలోకి దూసుకొచ్చింది. ఉచిత డేటాసేవలకు ఇప్పుడిప్పుడే జనం అలవాటుపడుతున్నారు. ఈనేపథ్యంలో ఇండియాలో ప్రస్తుతానికి ప్రతిరోజు ఇంటర్నెట్ వాడే వారు జనాభాలో 19శాతం మాత్రమేనని సదురు సంస్థ వెల్లడించింది. ఇండియాలోని దాదాపు 35శాతం మంది ప్రజలు ఇంటర్నెట్ కు పూర్తి దూరంగా ఉన్నారని సదురుసంస్థ వెల్లడించింది.ఇప్పుడీ నిజాలు అందరినీ విస్మయానికి గురిచేస్తున్నాయి.