Begin typing your search above and press return to search.

బాబు పాలనలో ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు షురూ

By:  Tupaki Desk   |   1 March 2016 3:22 PM IST
బాబు పాలనలో ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు షురూ
X
హైటెక్ అనే పదానికి అసలుసిసలు బ్రాండ్ అంబాసిడర్ వ్యవహరించే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. తన మార్క్ నిర్ణయం తీసుకోవటమే కాదు.. దాన్ని తాజాగా అమల్లోకి తీసుకొచ్చారు. కొత్త వాహనాల్ని కొనుగోలు చేసినప్పుడు.. ఆ వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించటానికి చాలానే ఇబ్బంది పడాలి. ఆర్టీవో ఆఫీసుకు వెళ్లి.. అక్కడున్న రద్దీలో.. మన అప్లికేషన్ ఇచ్చి.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసేసరికి తల ప్రాణం తోకకు వస్తుంది.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే. ఆర్టీవో ఆఫీసు వద్ద ఉంటే ఏజెంట్లకు ఎంతో కొంత ముట్టజెప్పి.. వారి చెప్పినట్లుగా చేస్తే కానీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కాని దుస్థితి. ఇలాంటివేమీ లేకుండా.. అందుబాటులో ఉన్న సాంకేతికతతో ఆన్ లైన్ లోనే ఈ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేసేలా ఒక కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ప్రకారం.. వాహన రిజిస్ట్రేషన్లను ఆన్ లైన్ పద్దతిలో పూర్తి చేసే వీలుంది.

ఈ హైటెక్ పథకాన్ని ప్రారంభించేందుకు చంద్రబాబు వినూత్న పద్ధతిని ఎంచుకున్నారు. విజయవాడలో ఉన్న ఆయన.. ఈ కార్యక్రమం కోసం వైజాగ్ వెళ్లే కన్నా.. ఆన్ లైన్ పద్ధతిలోనే విజయవాడ నుంచి విశాఖకు కనెక్ట్ అయి.. అక్కడ ఆ పథకాన్ని షురూ చేసేసి.. తానెంత హైటెక్ ముఖ్యమంత్రి అన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. చంద్రబాబ.. మజాకానా?