Begin typing your search above and press return to search.
బ్రిటన్ లో ‘ఆన్ లైన్ వ్యాక్సిన్ క్యూ క్యాలికులేటర్ ’.. ఏం చేస్తుంది?
By: Tupaki Desk | 20 Dec 2020 11:15 AM ISTమొన్నటివరకు ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారికి ఇప్పుడు టీకాతో చెక్ పెడుతున్న సంగతి తెలిసిందే. దీంతో.. ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే.. ఈ టీకా ఫలితం ఎంత మేర ఉంటుందన్న విషయంపై పూర్తి అవగాహన రానప్పటికీ.. సైడ్ ఎఫెక్టులు చాలా తక్కువనే చెప్పాలి. ఒక కొత్త టీకాకు సంబంధించిన అక్కడక్కడా కొన్ని చేదు అనుభవాలు నమోదు కావటాన్నిసీరియస్ గా తీసుకోవాల్సిన వసరం లేదు. ఇదిలా ఉంటే.. బ్రిటన్ లో టీకా వేసే కార్యక్రమాన్ని సాంకేతిక హంగును చేర్చారు.
వినూత్నంగా ఉన్న ఈ కార్యక్రమంలో వ్యాక్సిన్ వేయించుకోవటానికి ఒక పౌరుడికి ఎప్పటికన్న విషయాన్ని తెలియజేసే ఆన్ లైన్ వ్యాక్సిన్ క్యూ క్యాలికులేటర్ ను ఆవిష్కరించారు. ఇందులో ప్రజలు తమ వివరాల్ని నమోదు చేసుకోవటం ద్వారా టీకా వేయటానికి తమ వంతు ఎప్పటికి వస్తుందన్న విషయాన్ని తెలుసుకునే వీలుంది. దీంతో.. అనవసరంగా హడావుడి పడాల్సిన అవసరం లేదు.
ఈ క్యాలికులేటర్ టీకా వేయించుకోవాలనుకునే వారికి సంబంధించి వయసు.. వారి పరిస్థితితో పాటు పలు వివరాల్ని అడుగుతుంది. వివరాల్ని నమోదు చేసిన తరవాత వ్యక్తుల అవసరాలు.. వారి వయసు.. వారు పేర్కొన్న అంవాల ఆధారంగా జాతీయ స్థాయిలో వ్యాక్సినేషన్ క్యూ జాబితాలోకి వారి వివరాల్ని పొందుపరుస్తుంది. వారికో యూనిక్ నెంబరును కేటాయిస్తారు. అంతేకాదు.. ప్రాధాన్యత క్రమంలో వారికి ఎప్పుడు.. ఎక్కడ టీకా అందజేస్తారన్న వివరాల్ని పేర్కొంటారు. అత్యవసరం అనుకుంటే వారికి తొలి ప్రాధాన్యం లభిస్తుంది. దీంతో.. అనవసరమైన రద్దీతో పాటు.. పలు పనికిమాలిన అంశాల్ని నిరోధించే వీలుంది.
వాస్తవానికి ఈ తరహా సాంకేతికత బ్రిటన్ కంటే ఎక్కువగా మనకే అవసరమవుతుంది. ప్రజలందరికి.. అందునా ప్రాధాన్యత క్రమంలో ముందుగా వ్యాక్సిన్ అందాల్సిన వారికి దీని ద్వారా అందించే వీలుంది. దేశ వ్యాప్తంగా ఈ తరహా విధానాన్ని అమలు చేసేందుకు మోడీ సర్కారు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ.. కేంద్రానికి ఇది పట్టకపోతే.. కనీసం తెలుగు రాష్ట్రాలైనా ఈ విధానాన్ని అమలు చేస్తే.. టీకా కార్యక్రమం పారదర్శకంగా.. మెరుగ్గా సాగే వీలుంది.