Begin typing your search above and press return to search.
హైదరాబాద్ పోలీసులు దెబ్బకు రూ.1100 కోట్ల చైనా కంపెనీల స్కాం క్రాక్
By: Tupaki Desk | 14 Aug 2020 9:00 AM ISTమోసాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ఆన్ లైన్ లో.. మరో భారీ స్కాంను క్రాక్ చేశారు హైదరాబాద్ పోలీసులు. ఆన్ లైన్ గేమ్ పేరుతో మాయ చేసే చైనా సంస్థల భాగోతాన్ని బట్టబయలు చేసిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ చైనా సంస్థల మోసం ఎంతో తెలుసా? అక్షరాల రూ.1100 కోట్లకు పైనే ఉందంటున్నారు. ఈ కామర్స్ పేరుతో సంస్థల్ని.. వెబ్ సైట్లను రిజిస్టర్ చేస్తున్న చైనా కంపెనీలు.. ఈ ముసుగులో ఆన్ లైన్ గేముల్ని ప్రోత్సహిస్తూ.. అమాయకుల మీద వల విసురుతున్నాయి.
ఏడాదిలో దేశంలో రూ.1100 కోట్ల టర్నోవర్ చేసే ఈ ఆన్ లైన్ గేమ్.. ఇప్పటికే రూ.110కోట్లను విదేశాలకు తీసుకెళ్లినట్లుగా గుర్తించారు. దీనిపై వచ్చిన ఒక ఫిర్యాదు ఆధారంగా చేసుకొని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు దర్యాప్తు చేసి ఒక చైనీయుడితో సహా నలుగురు నిందితుల్ని అరెస్టు చేశారు. ఈ కంపెనీకి చెందిన రెండు బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.30కోట్లను ఫ్రీజ్ చేసినట్లుగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు.
ఈ ఆన్ లైన్ గేమ్ ను ప్రత్యేకమైన ప్రోగ్రామింగ్ ద్వారా రూపొందించినట్లు చెబుతున్నారు. ఒక కొత్త వ్యక్తి ఇందులో ప్రవేశించిన తర్వాత అతడి ఐపీ అడ్రస్ తో పాటు ఇతర వివరాల్ని సేకరిస్తుంది. మొదట కొన్ని రోజుల పాటు అతను గెలిచేలా చేస్తుంది. దీంతో.. ఆ ఆటకు బానిసగా మారతారు. తర్వాత కొన్ని గేముల్లో ఓడేలా చేస్తారు. దీంతో.. కసిగా దాన్ని సాధించాలన్న భావనతో భారీగా ఆడటం మొదలు పెడతారు. ఎప్పుడైతే ఎక్కువగా డబ్బులు పందానికి పెడతారో.. అప్పుడు ఓడిపోతారు. ఈ ఆటలో ఇప్పటివరకు సంపాదించిన వారు ఉండరని.. మొత్తం మోసపోయే వారే ఉంటారని చెబుతున్నారు.
అంతేకాదు.. ఈ గేమ్ లో సభ్యుల్ని చేర్పించిన వారికి రిఫరెల్ కోడ్ కు ప్రోత్సాహకంగా రూ.వెయ్యి ఇస్తారు. అంతేకాదు.. ఓడిన మొత్తంలో 10 శాతం రాయితీ కూడా ఇస్తారు. ఇలా అన్ని విధాలుగా నమ్మించి మోసం చేసి.. భారీగా కొల్లగొట్టటం ఈ మోసం ప్రత్యేకత. ఇంతకీ ఈ గేమ్ ఏమిటంటే.. కలర్ ప్రిడిక్ష న్ గా చెప్పాలి. నేరుగా ఈ ఆట ఆడేందుకు వీల్లేదు. ఎవరో ఒక రిఫరల్ గా మాత్రమే వెళ్లొచ్చు. గేమ్ లోకి వెళ్లాక.. అక్కడ ఉన్న ఆప్షన్ లో ఎరుపు.. ఆకుపచ్చ.. పసుపురంగుల్లో ఏదో ఒక దాన్ని ఎంచుకోవాలి. దానిపై ఎంత మొత్తం పందెం కాస్తున్నామో పేటీఎం ద్వారా చెల్లించాలి.
ప్రోగ్రామింగ్ లో రన్ అయి.. ఒక రంగు దగ్గర వచ్చి ఆగుతుంది. ఎంచుకున్న రంగు వస్తే.. ఆ మొత్తానికి రెండు నుంచి నాలుగు రెట్లు డబ్బు వారి పేటీఎం ఖాతాలో జమ అవుతుంది. రాకపోతే.. ఆ పందెం కాసిన మొత్తం సంస్థకు వెళుతుంది. మొదట్లో గెలిపించి.. తర్వాత ఓడిస్తూ.. అప్పటివరకు గెలిచిన మొత్తంతో పాటు.. భారీగా డబ్బులు పోగొట్టుకున్న వారు వేలల్లో ఉన్నారు. ఈ కంపెనీలు చైనావి కావటం.. భారత్ లో వారు డైరెక్టర్లను ఏర్పాటు చేసుకోవటం గమనార్హం. తమకు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఒక చైనీయుడితో సహా మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరింత లోతుల్లోకి వెళితే.. సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.