సంచలన పరిశోధన : ఉల్లితో డయాబెటిస్ కు చెక్?

Sat Oct 01 2022 20:00:01 GMT+0530 (India Standard Time)

onion cure diabetes

ఉల్లి చేసిన మేలు తల్లి చేయదంటారు.. ఎందుకంటే మన కంటి నుంచి తల్లులు తెప్పించని నీళ్లు  ఉల్లిపాయ తరిగేటప్పుడు అనుకోకుండానే వస్తాయి. ఒక మనిషి ఆరోగ్యానికి ఉల్లిపాయ ఎంతో సహకరిస్తుంది. ఉల్లిపాయను కేవలం కర్రీలోనే కాకుండా నేరుగా కూడా కొన్ని ఆహార పదార్థాలతో తీసుకోవడం ఎంతో రుచిగా ఉంటుంది. కానీ దాని నుంచి వచ్చే స్మెల్ ద్వారా చాలా మంది దానిని అవైడ్ చేస్తారు. కానీ దీని ఉపయోగాలు తెలిస్తే మాత్రం తినకుండా ఉండరు.ప్రపంచాన్ని భయపెడుతున్న మహమ్మారి ఏదంటే అది ‘షుగర్ వ్యాధి’ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక్కసారి డయాబెటిస్ వస్తే చచ్చినా పోదు. జీవితాంతం మందులు వాడాల్సిందే. మధుమేహ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.
హెచ్.ఓ) ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 422 మిలియన్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. ఈ వ్యాధి కారణంగా ప్రతీ సంవత్సరం సుమారు 1.5 మిలియన్ మరణాలు సంభవిస్తున్నాయి. ఇది ముఖ్యంగా అనారోగ్యకరమైన జీవనశైలి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగినప్పుడు సంభవిస్తుంది.

మధుమేహాన్ని పూర్తిగా నయం చేయలేమని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. అందువల్ల మన శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహించడం చాలా ముఖ్యమైంది. ఆరోగ్యకరమైన జీవనశైలి మన రక్తంలో చక్కెరను తనిఖీ చేయడానికి అదుపులో ఉంచడానికి ఉత్తమ మార్గంగా పేర్కొంటున్నారు.

షుగర్ ను నియంత్రించడంలో ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. మన వంటగదిలో ఉండే ఆహార పదార్థాలతోనే మనం షుగర్ ను కంట్రోల్ చేయవచ్చు.అలాంటి ముఖ్యమైన ఆహార పదార్థాలలో ‘ఉల్లిపాయ’ ఒకటి.  తాజా అధ్యయనంలో ఈ నమ్మశక్యం కాని నిజం బయటపడింది.

శాన్ డియాగోలో జరిగిన ఎండోక్రైన్ సొసైటీ 97వ వార్షిక సమావేశంలో సమర్పించిన అధ్యయనంలో కీలక విషయాలు వెలుగుచూశాయి.  రక్తంలో చక్కెర స్థాయిలను 50శాతం తగ్గించడంలో సహాయపడే లక్షణాలు ఉల్లిపాయలో ఎక్కువగా ఉన్నాయని కనుగొన్నారు. అంతేకాదు.. కొలెస్ట్రాల్ ను నిర్వహించడానికి ఇది గొప్పదని కూడా నిరూపితమైంది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. ‘ఉల్లిపాయ బల్బ్ అలియం సెపా యాంటిడయాబెటిక్ డ్రగ్ మెటాఫార్మిన్ తో ఇచ్చినప్పుడు డయాబెటిక్ ఎలుకలలో రక్తంలో అధిక గ్లూకోజ్ (చక్కెర) మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలను బాగా తగ్గించిందని తేలింది.

తాజాగా పరిశోధకులు ఎలుకలకు ఉల్లిపాయ సారాన్ని మూడు వేర్వేరు మోతాదులలో ఇచ్చారు. వీటికి సరిపోల్చడానికి సాధారణ రక్త చక్కరతో నాన్ డయాబెటిక్ ఎలుకల మూడు ఇతర సమూహాలను ఉపయోగించారు. దీని ద్వారా డయాబెటిక్ ఎలుకలలో రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా తగ్గించడంతోపాటు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతున్నట్టు కనుగొన్నారు.

ఉల్లిపాయలో కెలరీలు ఎక్కువగా ఉండవని.. అయినప్పటికీ అది జీవక్రియ రేటును పెంచుతున్నట్టు తేలింది. దాంతోపాటు ఆకలిని పెంచడం.. దాణా పెరుగుదలకు దారితీసిందని తేలింది. ఉల్లి రక్తంలో గ్లూకోజ్ తగ్గింపునకు దారితీసిన పరిస్థితులను అధ్యయనాన్ని తాము పరిశోధించాల్సిన అవసరం ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడానికి మీ రోజువారీ ఆహారంలో ఉల్లిపాయను చేర్చుకోవాలని తాము సూచిస్తున్నామన్నారు.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.