Begin typing your search above and press return to search.
భారత్ రాకుండా ఉండేందుకు మాల్యాకు ఒక్క ఛాన్స్ ఉందా?
By: Tupaki Desk | 15 May 2020 9:45 AM ISTవేల కోట్లు బ్యాంకులకు టోపీ పెట్టి.. తన దారిన తాను వెళ్లిపోయిన వ్యాపార వేత్త విజయ్ మాల్యా భారత్ కు రావాల్సిన తప్పనిసరి పరిస్థితి తాజాగా నెలకొంది. బ్రిటన్ లో ఉన్న ఆయన్ను.. భారత్ కు అప్పగించాల్సిన బాధ్యత ఆ దేశం మీద పడింది. బ్యాంకులకు తాను చెల్లించాల్సిన రూ9వేల కోట్లు తిరిగి కట్టేస్తానని.. తనను మాత్రం భారత్ కు పంపొద్దంటూ ఆయన చేసిన విన్నపాల్ని బ్రిటన్ కోర్టు మన్నించలేదు.
దీంతో.. ఆయన భారత్ కు రాక తప్పలేదు. నెల వ్యవధిలో ఆయన్ను భారత్ కు అప్పగించాల్సిన పరిస్థితి. ఇలాంటివేళ.. మాల్యా ఈ గడ్డు పరిస్థితి నుంచి తప్పించుకునేందుకు ఏ చిన్న అవకాశం లేదా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. వేలాది కోట్ల ఆస్తిపరుడు.. తన వాదనను నెగ్గించుకోవటానికి చేయని ప్రయత్నం ఉండదు. అలాంటివేళ.. మాల్యాకు న్యాయపరమైన అవకాశం ఏదైనా ఉందా? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.
న్యాయ నిపుణుల వాదన ప్రకారం.. మాల్యాకు ఒకే ఒక్క అవకాశం ఉందంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ కు వెళ్లకుండా బ్రిటన్ లోనే ఉండేందుకు యూరోపియన్ కోర్టు ఆఫ్ హ్యుమన్ రైట్స్ ఒక్కటే మార్గమని చెబుతున్నారు. తన విషయంలో పారదర్శక విచారణ లభించలేదన్న వాదనను వినిపిస్తూ యూరోపియన్ కన్వెన్షన్ ఆన్ హ్యూమన్ రైట్స్ లోని ఆర్టికల్ 3 కింద అప్పగింతను వ్యతిరేకిస్తూ తనకు అనుకూలంగా ఆదేశాలు జారీ చేయాలని కోరే అవకాశం ఉందంటున్నారు.
ఇప్పటికే ఇలాంటి అంశాల మీదనే న్యాయ పోరాటం చేసి ఎదురు దెబ్బలు తిన్న మాల్యాకు.. తాజాగా ఉన్న అవకాశం చాలా చిన్నదని.. అలా అని దాన్నికొట్టిపారేసేందుకు వీల్లేదని చెబుతున్నారు. మరి.. ఆ అవకాశాన్ని మాల్యా వినియోగించుకుంటారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.