Begin typing your search above and press return to search.
రాంగ్ టైమింగ్ లో 'ఎయిర్ ఇండియా వన్' ఎంట్రీ?
By: Tupaki Desk | 16 Aug 2020 8:00 AM ISTప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వంటి వీవీఐపీలు ప్రయాణించేందుకు 2 బోయింగ్ – 777 ఎయిర్‌క్రాఫ్ట్స్ ప్రత్యేకంగా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎయిర్‌క్రాఫ్ట్ ఎయిర్ ఫోర్స్ వన్‌తో సరితూగేలా వీవీఐపీల ట్రావెలింగ్ కోసం రెండు బోయింగ్ 777 – 300ఈఆర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను డల్లాస్‌లోని బోయింగ్ ఫెసిలిటీ రీమోడల్ చేస్తోంది. 190 మిలియన్ డాలర్ల వ్యయంతో మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్‌తో పాటు అన్ని సెక్యూరిటీ మెజర్స్‌తో వీటిని రీఫర్నిష్ చేస్తున్నారు. దాదాపు రూ.8458 కోట్ల వ్యయంతో రూపొందిస్తున్న ఈ విమానాలలో ఒకటి రెడీ అయినట్లు తెలుస్తోంది. దానిని భారత్ కు తరలించేందుకు కొంతమంది అధికారులు అమెరికా వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ విమానం అన్ని పరీక్షలు పూర్తి చేసుకోవడంతో అమెరికా ఫెడరల్ వైమానిక యంత్రాంగం దానికి సర్టిఫికెట్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఎయిర్ ఇండియా సంస్థ ఈ విమానాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు అప్పగించనుందని, `ఎయిర్ ఇండియా వన్` బాధ్యతలను ఐఏఎఫ్ చూసుకుంటుందని తెలుస్తోంది.
వాస్తవానికి ఈ విమానాల తాలూకు ఒప్పందం విమానాలు సిద్ధమైపోయినప్పటికీ ప్రస్తుతం ఆ విమానం డెలివరీకి రెడీ కావడంపై విమర్శలు వస్తున్నాయి. దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సమయంలో ఆ విమానంపై చర్చ విమర్శలకు తావిస్తోంది. కరోనా ఉగ్రరూపం దాలుస్తున్నతరుణంలో మోదీజీ టూర్ల కోసం విమానాలు సిద్ధం చేసుకుంటున్నారని విపక్షాలు విమర్శలు మొదలుపెట్టేశాయి. ఈ టైంలో ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారంటూ కామెంట్లు చేస్తున్నాయి. అయితే, మోడీ వంటి వీవీఐపీలు ప్రయాణించేందుకు ఈ విమానం చాలా అవసరమన్నది రక్షణ శాఖ నిపుణుల వాదన. కానీ, రాంగ్ టైమింగ్ లో ఈ విమానం రెడీ కావడం మోడీ సర్కార్ బ్యాడ్ లక్ అని చెప్పవచ్చు. మరి, ఈ విమానం సిద్ధమై...ఇండియాకు వస్తే ఆ విమర్శలను మోడీ సర్కార్ ఎలా హ్యాండిల్ చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.