Begin typing your search above and press return to search.

మిస్టరీ కేసు.. అదే బావిలో మరో బాలిక శవం

By:  Tupaki Desk   |   29 April 2019 4:17 PM IST
మిస్టరీ కేసు.. అదే బావిలో మరో బాలిక శవం
X
పదో తరగతి విద్యార్థిని శ్రావణి హత్య కేసు చిక్కుముడి వీడకముందే మరో అంతుచిక్కని మలుపు వెలుగుచూసింది. పదోతరగతి విద్యార్థిని శ్రావణి మృతదేహం దొరికిన బావిలోనే మరో బాలిక మృతదేహాన్ని పోలీసులు వెలికితీయడం కలకలం రేపింది. యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్ లో చోటు చేసుకున్న ఈ ఇద్దరు బాలిక మరణం కలకలం రేపుతోంది.

పదోతరగతి విద్యార్థిని శ్రావణి స్కూల్ నుంచి తిరిగి వస్తూ అదృశ్యమైంది. చివరకు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపి ఆమె మృతదేహాన్ని గ్రామానికి సమీపంలోని పాడుబడిన బావిలో కనుగొన్నారు.శ్రావణి హత్య రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. హత్య చేసిన వారిని పట్టుకోవాలని ఆందోళనలు చెలరేగాయి.

ఈ కేసులో ఇప్పటికే గ్రామానికి చెందిన పాత నేరస్థుడితోపాటు మరో ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే తాజాగా అదే బావిలో మరో బాలిక మృతదేహం కూడా లభ్యం కావడం గ్రామంలో సంచలనంగా మారింది. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

తాజాగా దొరికిన బాలిక మృతదేహం మనీషా అనే బాలికదిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే గ్రామానికి చెందిన కల్పన అనే బాలిక కూడా అదృశ్యమై నాలుగేళ్లయ్యింది.ఇప్పుడు ఇద్దరు వరుసగా బాలికలు మృతదేహాలు బయటపడడంతో ఈ కేసు మిస్టరీగా మారింది. ఈ గ్రామంలో వరుసగా బాలికలు అదృశ్యం కావడం ఇద్దరు మృతదేహాలు బయటపడడం సంచలనంగా మారింది.