Begin typing your search above and press return to search.

తూ.గో..లో ఒక్కడి పుణ్యమా అని 222 మందికి అంటేసింది

By:  Tupaki Desk   |   19 Jun 2020 4:00 AM GMT
తూ.గో..లో ఒక్కడి పుణ్యమా అని 222 మందికి అంటేసింది
X
ఒక చిన్న తప్పు చాలు.. కరోనా అంటుకోవటానికి. తప్పు చేసినోడికి మాత్రమే కాదు.. అతడికి దగ్గరగా ఉన్నోళ్లు సైతం శిక్ష అనుభవించని పరిస్థితి. ఒక్కరికి పాజిటివ్ వచ్చినా.. అతడి ద్వారా మాయదారి రోగం అంతకంతకూ విస్తరించే వైనం తెలిసిందే. తాజాగా దీని ప్రభావం ఎంత ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని కళ్లకు కట్టే ఉదంతం ఒకటి తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాకు చెందిన పెదపూడి మండలం గొల్లల మామిడాడలో ఒకరికి పాజిటివ్ గా తేలింది. మే 21న నమోదైన పాజిటివ్ కేసు పుణ్యమా అని.. ఆ ప్రాంతానికి దగ్గర్లోని ఏడు మండలాలకు విస్తరించటమే కాదు.. ఏకంగా 222 మందికి సోకినట్లు అధికారులు గుర్తించారు. ఒక్క మామిడాడ గ్రామంలోనే 119 పాజిటివ్ కేసులు వచ్చినట్లుగా తేల్చారు. ఈ గ్రామం ఉన్న పెదపూడి మండలంలో ఏకంగా 125 కేసులు నమోదయ్యాయి.

ఇదంతా చూస్తే.. మహమ్మారి తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటుందన్న విషయం తాజా ఉదంతాన్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఇదిలా ఉంటే తెలంగాణలో మహ్మమారి తీవ్రత అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ ఎప్పుడూ లేని రీతిలో హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో 300లకు పైగా కేసులు నమోదు కావటం తెలిసిందే.

తాజాగా జీహెచ్ ఎంసీలో విధులు నిర్వర్తిస్తున్న ఒక ఐఏఎస్ అధికారితో పాటు.. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ లో పని చేస్తున్న ఒక ఐపీఎస్ అధికారికి పాజిటివ్ గా తేలినట్లు చెబుతున్నారు. ఇప్పటివరకూ ఏసీపీ.. గ్రూప్ 1 స్థాయి అధికారులకు వైరస్ సోకగా.. తొలిసారి నగరంలోని ఐఏఎస్.. ఐపీఎస్ అధికారుల స్థాయి వారికి సోకినట్లైంది. మూడు నెలలుగా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న సదరు అధికారి.. గడిచిన రెండు రోజులుగా అనుమానిత లక్షణాలతో ఇంటికే పరిమితమయ్యారు.

ఇక.. హైదరాబాద్ కమిషనరేట్ లో పని చేస్తున్న ఐపీఎస్ అధికారికి నాలుగు రోజుల క్రితం మహమ్మారి అనుమానిత లక్షణాలు నాలుగు రోజుల క్రితం కనిపించాయి. దీంతో.. ఆయన గడిచిన మూడురోజులుగా ఇంటికే పరిమితమైనట్లు సమాచారం. ఐపీఎస్ కు పాజిటివ్ అని తేలటంతో.. ఆయనతో ఉండే సెక్యురిటీ సిబ్బంది పాటు.. మిగిలిన సిబ్బందికి ముందస్తు వైద్య పరీక్షలు నిర్వహించారు. వారిని క్వారంటైన్ కు తరలించారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ఐపీఎస్.. ఐఏఎస్ అధికారులకు మాయదారి రోగం ఎలా సోకుతుందన్నది ఇప్పుడో పెద్ద ప్రశ్నగా మారింది.