Begin typing your search above and press return to search.

ఒక్కమ్యాచ్​ ఆ ఆటగాడి జాతకం మార్చేసింది.. !

By:  Tupaki Desk   |   23 Feb 2021 8:00 AM IST
ఒక్కమ్యాచ్​ ఆ ఆటగాడి జాతకం మార్చేసింది.. !
X
ఇంగ్లాండ్​తో జరుగనున్న టీ20 సీరిస్​కు లెగ్​స్పిన్నర్​, ఆల్​రౌండర్​ రాహుల్​ తెవాటియా ఎంపికయ్యాడు. అయితే రాహుల్​ను ఈ సీరిస్​కు ఎంపిక చేయడానికి కారణమేంటి? సెలక్టర్ల దృష్టిని అతడు ఎలా ఆకర్షించాడంటే..
గత ఏడాది యూఏఈ వేదికగా జరిగిన ఓ మ్యాచ్​లో రాహుల్ సత్తా చాటాడు. తన ఆల్​రౌండ్​ ప్రతిభను చాటాడు. ఐపీఎల్​లో రాజస్థాన్​ తరఫున ఆడిన రాహుల్​.. కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​తో జరిగిన మ్యాచ్​ను ఒంటి చేత్తో గెలిపించాడు. కీలక సమయంలో
31 బంతుల్లో 7 సిక్సర్లతో 53 పరుగులు సాధించి రాజస్థాన్‌కు విజయాన్ని అందించాడు. ఈ ఒక్క మ్యాచ్​ అతడి కెరీర్​ ను మార్చేసింది. టీంఇండియా సెలక్టర్లు ఈ మ్యాచ్​ను చూసే రాహుల్​ను ఎంపికచేశారట.


ఎంపిక కావడం పట్ల రాహుల్​ మాట్లాడుతూ.. ‘ నేను టీంఇండియా టీ20 కి సెలక్ట్ అయినట్టు యజువేంద్ర చహల్ చెప్పాడు. అయితే అతడు కాల్​ చేయగానే జోక్​ చేస్తున్నాడేమో అనుకున్నా. ఆ తర్వాత మోహిత్​ కూడా ఇదే విషయాన్ని చెప్పడంతో హ్యాపీగా ఫీలయ్యా. నేను జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా. హర్యానా నుంచి టీం ఇండియాకు ఇప్పటికే ముగ్గురు స్పిన్నర్లు ఆడారు. చహల్, అమిత్​ మిశ్రా, జయంత్ యాదవ్​ టీమిండియాలో చోటు దక్కించుకున్నారు. అయితే నాకు అవకాశం వస్తే సద్వినియోగం చేసుకుంటాను’ అని చెప్పారు రాహుల్​.


టీమిండియాకు ఎంపికయిన మరునాడే దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో హరియానా తరఫున ఆడుతున్న రాహుల్ తెవాటియా.. చండీగఢ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సిక్సర్ల వర్షం కురిపించాడు. 39 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 73 పరుగులు చేశాడు. తెవాటియా రాణించినా హరియానాకు ఓటమి తప్పలేదు.ముంబై బ్యాట్స్‌మన్ సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌ కూడా టీ20 జట్టుకు ఎంపికయ్యారు. సూర్యకుమార్​ సుదీర్ఘ నిరీక్షణ అనంతరం టీం ఇండియాలో చోటు దక్కింది. ఆస్ట్రేలియా టూర్​కు సూర్య కుమార్​ను ఎంపిక చేయకపోవడంతో అప్పట్లో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.