Begin typing your search above and press return to search.
రైతును పెళ్లి చేసుకుంటే లక్ష
By: Tupaki Desk | 24 Feb 2019 11:07 AM GMT‘ఉద్యోగం, సద్యోగం లేనోడికి పిల్లనెవడిస్తాడు..’ కుటుంబాల్లో కామన్ గా వినిపించే డైలాగ్ ఇదే.. అందుకే ఉద్యోగం పురుష లక్షణం అంటూ స్వయం ఉపాధితో బతుకుతున్న వారు కూడా పెళ్లి కావడానికి ఏదో ఒక ఉద్యోగంలో చేరి పెళ్లి తంతును ముగిస్తారు. ఇప్పుడు దేశంలో ఉద్యోగం లేకుండా ఉన్న వారికి పెళ్లిళ్లు జరగడం లేదంటే అతిశయోక్తి కాదు.. సాఫ్ట్ వేర్ లకు పిల్లనిచ్చినంత ఈజీగా రైతులకు ఇవ్వడం లేదు. అందుకే ఈ పరిస్థితిని మార్చాలని కర్ణాటకలోని ‘అనగోడు సేవా సహకార సంఘం’ ఓ నిర్ణయానికి వచ్చింది.
ఉత్తర కర్ణాటకలోని ఓ చిన్న గ్రామం అనగోడు. ఇక్కడ వక్కచెట్లు, వరి బాగా పండుతుంది. స్థానిక రైతులంతా మంచి లాభాలు ఆర్జిస్తారు. యువత కూడా వ్యవసాయం చేస్తూ వాణిజ్య పంటలు సాగుచేస్తూ లాభాలర్జిస్తున్నారు. కానీ రైతులైన యువకులకు పిల్లను ఎవ్వరూ ఇవ్వడం లేదు. దీంతో వారంతా బ్యాచ్ లర్ గానే మిగిలిపోతున్నారు.
దీంతో అనగోడు సహకారం సంఘాన్ని ఏర్పాటు చేశారు. 2000 మంది ఇందులో సభ్యులుగా చేర్పించారు. ఈ సహకార సంఘం ద్వారా నిత్యావసరాల నుంచి పశువులా దాకా అన్నింటిని సబ్సిడీ మీద ఇప్పించి గొప్ప విజయం సాధించారు. ఇప్పుడు పెళ్లికాని యువ రైతుల కోసం అనగోడు సంఘం గొప్ప పథకాన్ని ప్రారంభించింది. ఏప్రిల్ 1 నుంచి పెళ్లి కాని రైతులను చేసుకునే యువతులకు లక్ష రూపాయలు కానుకగా ఇస్తామని ప్రకటించింది. ఈ ప్రకటనతో యువరైతులను పెళ్లి చేసుకోవడానికి మహిళలు ఆసక్తి చూపుతున్నారు. రైతుల కష్టాలు తెలిసి చాలా మంది ముందుకు వస్తుండడం విశేషంగా చెప్పవచ్చు..