Begin typing your search above and press return to search.

తాగి.. తప్పించుకోబోయి ప్రాణాలే పోయాయే

By:  Tupaki Desk   |   7 Nov 2015 3:32 AM GMT
తాగి.. తప్పించుకోబోయి ప్రాణాలే పోయాయే
X
పూటుగా తాగటం.. బాధ్యత మరచి వ్యవహరించటం.. తమ మీద బోలెడన్ని ఆశలు పెట్టుకున్న వారిని శోకంలో నింపేయటం ఈ మధ్య తరచూ జరుగుతున్నాయి. తాజాగా అలాంటి సంఘటనే హైదరాబాద్ లో చోటు చేసుకుంది. తాగి వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకోవటానికి పోలీసులు తనిఖీలు చేయటం తెలిసిందే. తాజాగా అలాంటి తనిఖీని తప్పించుకోబోయి ప్రాణాలు పోగొట్టుకున్న దురదృష్టకర సంఘటన బంజాహిల్స్ లో చోటు చేసుకుంది.

శనివారం తెల్లవారుజామున పూటుగా మద్యం సేవించిన ఇద్దరు యువకులు వేగంగా వెళుతున్నారు. తనిఖీ నిమిత్తం పోలీసులు వారిని ఆపే ప్రయత్నం చేశారు. వారిని తప్పించుకునే ప్రయత్నం చేసిన వారు మరింత వేగంగా బైక్ ని నడిపినట్లు చెబుతున్నారు. పోలీసులకు చిక్కకూడదన్న హడావుడిలో అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టటంతో బైక్ మీదున్న ఇద్దరిలో ఒకరు అక్కడికక్కడే మరణించగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్దారు. గాయపడిన యువకుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు వైద్యసాయం కోసం ఆసుపత్రికి తరలించారు. యువకులిద్దరికి సంబంధించిన సమాచారం అందాల్సి ఉంది.