Begin typing your search above and press return to search.

వైట్ హౌస్ కు కూతవేటు దూరంలో కాల్పులు

By:  Tupaki Desk   |   20 Sept 2019 11:13 AM IST
వైట్ హౌస్ కు కూతవేటు దూరంలో కాల్పులు
X
అమెరికా అధ్యక్షుడి భవనం వైట్ హౌస్ కు కేవలం రెండు మైళ్ల దూరంలో కాల్పులు కలకలం సృష్టించాయి. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో గల కొలంబియా హైట్స్ వీధిలో గురువారం రాత్రి జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు.

తుపాకీ చేతబట్టుకొని వీధుల్లోకి వచ్చిన ఒక ఆగంతుకుడు కొలంబియా హైట్స్ పరిసరాల్లోని అపార్ట్ మెంట్ భవనం ప్రాంగణంలో ఆరుబయట ఈ కాల్పులకు తెగబడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. నిందితుడు ఇంకా తమ చేతికి చిక్కలేదని.. ఎందుకు కాల్పులు జరిపాడో కూడా తెలియలేదని మెట్రోపాలిటన్ పోలిస్ కమాండర్ స్టువార్ట్ ఎమర్మాన్ మీడియాకు తెలిపారు. నిందితుడు చాలా చురుకుగా కాల్పులు జరిపి పరారయ్యాడని త్వరలోనే సీసీ ఫుటేజీ ఆధారంగా అతడిని పట్టుకునేందుకు బలగాలను రంగంలోకి దింపామని ఆయన తెలిపారు.

కాల్పులకు గురైన ఐదుగురిలో ఇద్దరి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్టు అధికారులు తెలిపారు. మిగతా ముగ్గురు కోలుకుంటున్నట్టు తెలిపారు. వారి ప్రాణాలకు ముప్పులేదని తేల్చారు.

కాల్పులు కాల్పులు జరిగి గాయాలపాలైన వారిని పోలీసులు అంబెలెన్స్ ద్వారా తరలిస్తున్న వీడియోలను స్థానికులు ట్విట్టర్ లో పోస్టు చేయడంతో విషయం వెలుగుచూసింది. అక్కడికి పోలీసులు చేరుకొని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.