Begin typing your search above and press return to search.
జగన్ సర్కార్ కు ఒక్కరోజే టైం
By: Tupaki Desk | 21 Jan 2021 10:00 PM ISTఈనెల 8న పంచాయితీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై జగన్ సర్కార్ హైకోర్టుకు ఎక్కగా.. సుధీర్ఘ వాదనల అనంతరం తాజాగా ఎన్నికలు నిర్వహించాలని ఏపీ హైకోర్టు తీర్పునిచ్చింది.
హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ సుప్రీం కోర్టు తలుపు తట్టింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు ఉత్తర్వులు రద్దు చేయాలని పిటిషన్‌లో ప్రభుత్వం పేర్కొంది. వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. అయితే ఎన్నికలపై సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును సమర్థిస్తుందా లేదా అనేది తేలాల్సి ఉంది.
ఏపీ ప్రభుత్వానికి మాత్రం ఒకే ఒక రోజు మాత్రమే గడువు ఉంది. 23వ తేదీ నుంచి నామినేషన్ స్వీకరిస్తారు. 25న నామినేషన్‌లను ఫైనల్ చేస్తారు. ఎన్నికలను నాలుగు దఫాలుగా నిర్వహిస్తారు. ఫిబ్రవరి 5, 9, 13, 17 తేదీల్లో ఎన్నికలు నిర్వహిస్తారు.
ఎన్నికలు జరిగిన రోజే ఫలితాలను వెల్లడిస్తారు. 23 నుంచే నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 22 తేదీ (శుక్రవారం) ఒకే ఒక రోజు మాత్రమే ప్రభుత్వానికి గడువు ఉంది. రేపు సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.