Begin typing your search above and press return to search.

కలెక్టర్ చాలెంజ్: దమ్ముంటే ఒకరోజు కలెక్టర్ గా ఉండండి

By:  Tupaki Desk   |   14 July 2020 10:15 AM IST
కలెక్టర్ చాలెంజ్: దమ్ముంటే ఒకరోజు కలెక్టర్ గా ఉండండి
X
అసలే కరోనా టైం.. ఈ ప్రకృతి విపత్తును కంట్రోల్ చేయడానికి ప్రభుత్వాలు.. అధికారులు తెగ కష్టపడుతున్నారు. ఇలాంటి సమయంలో ఓ కలెక్టర్ లో ఆవేదన ఆగ్రహం పెల్లుబుకింది. ఈ సమయంలో కలెక్టర్ గా ఉండడం కత్తిమీద సాము అని.. కరోనా కట్టడిలో తనకంటే మంచిగా పనిచేసే వ్యక్తి ఉంటే ఒక రోజు కలెక్టర్ గా పనిచేసే అవకాశం కల్పిస్తానని సదురు కలెక్టర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ప్రకటన రాజకీయ, అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఒకే ఒక్కడు సినిమాలో సీఎం రఘువరన్ ఇలానే హీరో అర్జున్ కు ఆఫర్ ఇస్తే అతడు చేసిన మంచి పనులతో వ్యవస్థే మారిపోతుంది. ఆ సినిమా గుర్తుకు తెచ్చేలా ఇప్పుడు ఒక కలెక్టర్ ఏకంగా ప్రజలకు అలాంటి ఆఫర్ ఇవ్వడం చర్చనీయాంశమైంది.

ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ తాజాగా ఒంగోలులో వర్తకులతో సమావేశమయ్యారు. కరోనా కట్టడిలో తాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలల మార్గదర్శకాలను అమలు చేస్తున్నానని.. ఇలాంటి సమయంలో కలెక్టర్ గా పనిచేయడం అంత అషామాషీ వ్యవహారం కాదంటూ వ్యాఖ్యానించారు. తనకంటే మంచిగా పనిచేసే వ్యక్తి ఉంటే ఒక రోజు కలెక్టర్ గా పనిచేసే అవకాశం కల్పిస్తానని సవాల్ చేశారు. కలెక్టర్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఆయన ఇచ్చిన ఆఫర్ పై సోషల్ మీడియాలో చాలా మంది ట్రోల్స్, మీమ్స్, కామెంట్స్ చేస్తున్నారు.