Begin typing your search above and press return to search.

ఈ ఒక్క వీడియోతో అమెరికా బండారం బయట పెట్టిన చైనా

By:  Tupaki Desk   |   2 May 2020 9:30 AM IST
ఈ ఒక్క వీడియోతో అమెరికా బండారం బయట పెట్టిన చైనా
X
ప్రపంచంలోనే అగ్రరాజ్యం అమెరికా అత్యధిక కరోనావైరస్ కేసులు కలిగిన దేశంగా అవతరించింది. అక్కడి ట్రంప్ సర్కార్ ఈ ఫెయిల్యూర్ ను కప్పిపుచ్చుకునేందుకు చైనాపై నెపం వేస్తూ విమర్శలు చేస్తున్నారు. ప్రతీ విలేకరుల సమావేశంలోనూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. చైనాపై కోపాన్ని ప్రదర్శిస్తూ ఆరోపణలు చేస్తున్నారు. వైరస్ యొక్క తీవ్రతను చైనా దాచి పెట్టిందని.. తద్వారా అమెరికాకు పెద్ద నష్టం వాటిల్లిందని ఆరోపించారు.

అమెరికా అధ్యక్షుడి ఆరోపణలపై ఫ్రాన్స్‌లోని చైనా రాయబార కార్యాలయం గట్టి కౌంటర్ ఇచ్చింది. ఈ మేరకు 'వన్స్ అపాన్ ఎ వైరస్ ..' అనే టీజింగ్ వీడియోను విడుదల చేసింది. దీనితో అమెరికా వైఖరిని ఎండగట్టింది. దీనిలో వారు సూపర్ పవర్ దేశం అమెరికా నిర్లక్ష్యం మరియు వ్యాప్తిని నియంత్రించగలిగే అవసరమైన చర్యలను తీసుకోవడంలో చూపిన అశ్రద్ధను కళ్లకు కట్టారు.

ఈ 99-సెకన్ల వీడియో చైనా, డబ్ల్యూహెచ్‌ఓ మరియు యుఎస్‌ఎ మధ్య చోటుచేసుకున్న పరిణామాలు.. విమర్శలతో తయారు చేశారు. దేశంలో నివేదించబడిన ఒక వింత న్యుమోనియా కేసును చైనా నివేదించడంతో దానికి డబ్ల్యూ.హెచ్.వో మద్దతు తెలుపడంతో ఈ వీడియో మొదలవుతుంది, అయితే అమెరికా దీనిని ‘ఫ్లూ మాత్రమే’ అని మొదట చెప్పడాన్ని ఈ వీడియోలో ఎగతాళి చేశారు.

ముసుగు ధరించాలన్న సూచనలను అమెరికన్లు తేలిగ్గా తీసుకున్నారని.. లాక్ డౌన్ ను అనుసరించమని ఆందోళనలు చేస్తున్నారని వీడియోలో ఎద్దేవా చేశారు. ‘మానవ హక్కులను ఉల్లంఘిస్తోంది’ అని చైనాపై అమెరికా ఆరోపణలకు కౌంటర్ ఇస్తూ వీడియోలో అమెరికాను అపహాస్యం చేశారు. చైనా వైద్య శిబిరాలను నిర్మించడం, లాక్ డౌన్ వేయడం, చనిపోతున్న వైద్యులు, తరువాత చైనాకు డబ్ల్యూహెచ్‌ఓ మద్దతు నుంచి అన్ని‘అబద్ధాలు’ చెప్పారని ఆరోపిస్తూ చైనాను బహిరంగంగా చేసిన ప్రతి విమర్శలను ఇందులో చూపించి అమెరికాను వీడియోలో అపహాస్యం చేశారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంతకుముందు వైరస్ తీవ్రతను తక్కువగా అంచనా వేసినట్లు అంగీకరించారు, కాని తరువాత చైనా మరణాల సంఖ్య మరియు లక్షణాలను దాచిపెట్టిందని ఆరోపించారు. దీనికి చైనా ఇప్పుడు వ్యాఖ్యలను వ్యతిరేకిస్తోంది. రాబోయే రోజుల్లో చైనాపై మరిన్ని వ్యాపార ఆంక్షలు విధించాలని అమెరికా యోచిస్తోంది. డబ్ల్యూహెచ్‌ఓకు ఇప్పటికే నిధులను ట్రంప్ కట్ చేశారు.

ఈ సెటైరికల్ వీడియో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారుతోంది. అమెరికా అధ్యక్షుడిని, దేశాన్ని ఈ ఒక్క వీడియోతో చైనా ఎలా ఎగతాళి చేసిందో చూడటానికి వీడియో చూడండి.