Begin typing your search above and press return to search.

తమిళం - తెలుగుతో పోలిస్తే హిందీ ఒక బచ్చా

By:  Tupaki Desk   |   3 Oct 2019 5:36 AM GMT
తమిళం - తెలుగుతో పోలిస్తే హిందీ ఒక బచ్చా
X
సినీ నటుడు - రాజకీయ నేత కమల్ హాసన్ మరోసారి హిందీపై తన అక్కసు వెళ్లగక్కారు. ఇటీవలే కేంద్రహోంమంత్రి అమిత్ షా హిందీ దివస్ సందర్భంగా హిందీని దేశమంతా రుద్దుతామనడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తమిళనాడు నేతలు, బీజేపీ మిత్రపక్షాల నుంచి కూడా పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు ఎగజిమ్మాయి. అప్పుడే తీవ్రంగా ఖండించిన కమల్ హాసన్ తాజాగా మరో ఆసక్తికర కామెంట్ చేశారు.

భారతదేశ చరిత్రలో ప్రాచీన భాషలంటే తమిళం - తెలుగు - సంస్కృతం మాత్రమేనని.. ఈ భాషల ముందు హిందీ ఒక బచ్చా అని కమల్ హాసన్ సంచలన కామెంట్ చేశారు. హిందీ చరిత్రను కమల్ ప్రశ్నించాడు. తమిళ - తెలుగు - సంస్కృతంలు.. హిందీకన్నా పురాతనమైనవనట్టుగా కమల్ చెప్పుకొచ్చారు.

ఇక యువత రాజకీయలను అసహ్యించుకోవద్దని.. రాజకీయాల్లోకి వచ్చి వాటిని సంస్కరించాలని.. ఈ బాధ్యత యువత మీదే ఉందని కమల్ హాసన్ పిలుపునిచ్చారు.

దేశంలో హిందీని రుద్దుతామనే అమిత్ షా వ్యాఖ్యల ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల ఐఐటీ మద్రాస్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోడీ తమిళ భాష గొప్పతనంపై మాట్లాడి శాంతపరిచినా కమల్ హాసన్ మాత్రం తగ్గకుండా మళ్లీ హిందీపై నోరుపారేసుకోవడం సంచలనంగా మారింది.