Begin typing your search above and press return to search.
మరోసారి దుమ్మురేపిన హరీష్ రావు
By: Tupaki Desk | 26 Jan 2021 11:00 AM ISTరాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తాను మేటియేనని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు చాటిచెప్పారు. స్థానికంగా జరుగుతున్న క్రికెట్ పోటీల్లో తన క్రీడానైపుణ్యాన్ని హరీష్ రావు ప్రదర్శిస్తున్నారు.
సోమవారం జహీరాబాద్ లో మంత్రి హరీష్ రావు క్రికెట్ ఆడారు.తనదైన శైలిలో ఫోర్లు, సిక్సులతో స్కోర్ చేసి జట్టుకు భారీస్కోరు అందించారు. ప్రత్యర్థి ఆటగాళ్ల బౌలర్లు హరీష్ రావుకు బౌలింగ్ చేయలేక బెంబేలెత్తిపోయారు.
జహీరాబాద్ లో బాగారెడ్డి మైదానంలో మంత్రి హరీష్ రావు క్రికెట్ పోటీలను ప్రారంభించారు. మంత్రి హరీష్ రావు టీంకు,జిల్లా కలెక్టర్ హన్మంతరావు టీంల మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగింది.
టాస్ గెలిచిన కలెక్టర్ టీం బ్యాటింగ్ ఎంచుకుంది. తర్వాత హరీష్ రావు టీం బ్యాటింగ్ కు దిగింది. తన బ్యాటింగ్ లో హరీష్ రావు మెరుపులు మెరిపించాడు. సిక్సర్లు, ఫోర్లతో ప్రొఫెషనల్ క్రికెట్ గేమ్ ను తలపించాడు.
హరీష్ రావు ఆటను చూసి చప్పట్లతో జహీరాబాద్ క్రీడాభిమానులు ప్రోత్సహించారు. మంత్రి హరీష్ రావు ఇప్పుడే కాదు.. ఇది వరకు కూడా బ్యాటుతో వీరవిహారం చేసి భారీ స్కోరు చేసిన సందర్భాలున్నాయి.