Begin typing your search above and press return to search.
కేటీఆర్ పుట్టినరోజు వేళ.. నేతలు ఎంతలా పొగిడేశారంటే?
By: Tupaki Desk | 24 July 2020 10:30 AM ISTగడిచిన ఐదారేళ్లలో ఒక కొత్త మార్పు రాజకీయాల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. 2014కు ముందు.. మరింత క్లియర్ గా చెప్పాలంటే 2010కి ముందు అధినేతలు.. నేతల పుట్టినరోజులు వచ్చివి.. వెళ్లిపోయేవి. పార్టీ అధ్యక్షుడు.. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వారు తప్పించి మిగిలిన వారి పుట్టినరోజులకు అంత హడావుడి ఉండేది కాదు. కానీ.. ఇప్పుడు సీన్ మారిపోయింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పుట్టిన రోజు అన్నంతనే దేశ ప్రధాని సైతం ప్రత్యేకంగా సోషల్ మీడియాలో పుట్టిన రోజు గ్రీటింగ్స్ చెప్పటం.. కొందరికైతే అదనంగా ఫోన్ చేసి బర్త్ డే విషెస్ చెప్పటం ఇప్పుడో అలవాటుగా మారింది.
ఇలాంటి వేళ.. తెలంగాణ రాష్ట్రానికి ఫ్యూచర్ సీఎంగా అభివర్ణించే కేటీఆర్ లాంటి యువనేత పుట్టినరోజు వస్తే? ఎలాంటి పరిస్థితి ఉంటుందో తాజాగా నడుస్తున్న హడావుడి చూస్తే.. ఇట్టే అర్థమైపోతుంది. తాజాగా కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని కీలక నేతలు సైతం తెగ పొగిడేయటం.. ఆకాశానికి ఎత్తేయటం గమనార్హం. శాంపిల్ గా చూస్తే.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏకంగా పది అడుగులు ముందుకేసి.. దేశం గర్వపడే వ్యక్తి అని.. విజన్ ఉన్న నేత అని.. రాష్ట్రంలో కేసీఆర్ పుట్టినందుకు తాము గర్వపడుతున్నట్లుగా వ్యాఖ్యానించి అబ్బురపడేలా చేశారు.
కేటీఆర్ అద్భుత ప్రతిభా పాటవాలు ఉన్న వ్యక్తి అని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. అక్కడితే ఆగితే ఏం బాగుంటుంది చెప్పండి. అవకాశం దొరికినప్పుడే కదా నాలుగు మాటలు అనేయాలి. అందుకే.. తను లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. కేటీఆర్ లాంటి నేత తెలంగాణకు దొరకటం.. ఆయన నాయకత్వంలో పని చేయటం తమ అదృష్టంగా అభివర్ణించారు. మంత్రిగా కేటీఆర్ చేపట్టిన సంస్కరణలు ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు.
ఎంతోమంది యువకులకు రాజకీయంగా అవకాశం లభించినా.. కేటీఆర్ మాదిరి కొద్దిమంది మాత్రమే రాణించారని.. తక్కువకాలంలోనే కేటీఆర్ తానేమిటో నిరూపించుకున్నారని ప్రశంసించారు టీఆర్ఎస్ నేత ఉప్పల శ్రీనివాస్ గుప్తా. కేటీఆర్ ప్రాతినిధ్యం వహించే సిరిసిల్ల నియోజకవర్గంలో గడిచిన ఆరేళ్ల కాలంలో జరిగిన డెవలప్ మెంట్ మీద ఆయన ఏకంగా ఒక డాక్యుమెంటరీని తయారు చేశారు. ఇలా ఎవరికి వారు..ఒకరికి మించి మరొకరు అన్న చందంగా కేటీఆర్ ను పొగడటంలో చెలరేగిపోయారు. యువరాజు మీద ఆ మాత్రం అభిమానం చూపించకపోతే ఏం బాగుంటుంది చెప్పండి?