Begin typing your search above and press return to search.

పార్శిల్ లో చైనాకు ఒమిక్రాన్..

By:  Tupaki Desk   |   18 Jan 2022 2:34 PM GMT
పార్శిల్ లో చైనాకు ఒమిక్రాన్..
X
ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనా పుట్టినిల్లు చైనా అని తెల్సిందే. ఆ దేశంలోనే తొలిసారిగా వైరస్ తొలి కేసు నమోదైంది. చైనాలోని వూహాన్ లో వైరస్ పుట్టిందని కొందరు చెబితే... కొన్నిగుహల్లో ఉద్బవించిందని మరికొందరు చెప్పారు. అయితే కరోనా పుట్టింది చైనాలో కాదని ఆ దేశం కొన్నాళ్లు వాదించింది. ఇటలీ నుంచి వైరస్ తమ దేశానికి వ్యాప్తి చెందిందని అప్పట్లో గట్టిగానే చెప్పింది. ఆ తర్వాత సైలెంట్ అయింది. ఇక కరోనా ఫ్రీ కంట్రీగా మారేందుకు ప్రయత్నాలు చేస్తోంది. చైనాలో కరోనా కేసులు తగ్గించేందుకు కావాల్సిన అన్నిరకాల ఏర్పాట్లను చేస్తోంది. అయితే దక్షిణాఫ్రికాలో పుట్టిన ఒమిక్రాన్ వేరియంట్ కేసులు మాత్రం ఇప్పుడిప్పుడే ఆ దేశంలో నమోదవుతున్నాయి.

ఇప్పటికే వందకుపైగా దేశాలకు విస్తరించిన ఒమక్రాన్ కేసులు ఇటీవల చైనాలో నమోదైనట్లు బీజింగ్ అధికారులు వెల్లడించారు. అయితే ఈ కేసు ఓ పార్శిల్ ద్వారా సోకినట్లుగా వారు ఆరోపిస్తున్నారు. కెనడా నుంచి వచ్చిన ఓ పార్శిల్ నుంచి ఒమిక్రాన్ చైనాలో అడుగుపెట్టిందని వారు అంటున్నారు. కావాలనే చైనాకు ఒమిక్రాన్ వేరియంట్ ను పార్శిల్ రూపంలో పంపించారని ఆరోపణలు చేస్తోంది. ఇలా బీజింగ్ లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఇటీవల ఈ కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు వైరస్ ను ఎదుర్కోవడానికి చర్యలు చేపట్టింది. ఒమిక్రాన్ ను కట్టడి చేయడానికి నిబంధనలు కఠినతరం చేసింది. ఫిబ్రవరి 4 నుంచి శీతాకాల ఒలింపిక్స్ ఉండడంతో మరింత అప్రమత్తమైంది. అందరూ విధిగా మాస్క్ ధరించాలని. భౌతిక దూరం పాటించాలని ఆదేశించింది.

చైనాలో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. కరోనా ఫ్రీ దేశంలో మారేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇక భారత దేశంలో థర్డ్ వేవ్ ప్రారభంమైంది. ఇటీవల రోజుకు రెండున్నర లక్షల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మరికొన్ని రోజుల్లో 24 గంటల్లో 4లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనదేశంలోనూ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ప్రధానంగా ముంబయి, కలకత్తా, దిల్లీలో కేసులు పెరుగుతున్నాయి. పలువురు ప్రజాప్రతినిధులు సైతం కరోనా బారిన పడ్డారు. సినీ, రాజకీయ ప్రముఖులు చాలామందికి కరోనా సోకింది. అయితే టీకా రెండు డోసులు తీసుకున్నవారికి వైరస్ నుంచి పెద్దగా ముప్పు లేదని వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.