Begin typing your search above and press return to search.

కలవరపెడుతున్న ఒమిక్రాన్ కొత్త లక్షణం.. ఆ అవయవాన్ని కూడా వదల్లేదు!

By:  Tupaki Desk   |   24 Jan 2022 11:30 PM GMT
కలవరపెడుతున్న ఒమిక్రాన్ కొత్త లక్షణం.. ఆ అవయవాన్ని కూడా వదల్లేదు!
X
కరోనా మహమ్మారి కోరల్లో ప్రపంచదేశాలు నలిగిపోతున్నాయి. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. సంక్రాంతి పండుగ నుంచి తెలుగు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన ఫీవర్ సర్వే నివేదికలే ఇందుకు నిదర్శనం. తెలంగాణలో ప్రతి నలుగురిలో ఒక్కరికి కరోనా లక్షణానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయని వారు తెలిపారు. అయితే స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం అధ్యయనంలో ఒమిక్రాన్ గురించి మరో లక్షణం వెలుగులోకి వచ్చింది.

కరోనా వైరస్ లక్షణాలు, ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం వేర్వేరుగా ఉన్నాయి. కరోనాతో జలుబు, దగ్గు, జ్వరం, ఒంటి నొప్పులు మాత్రమే ఉన్నాయి. అయితే దక్షిణాఫ్రికాలో పుట్టిన ఒమిక్రాన్ వేరియంట్ వల్ల ఇతర సమస్యలు కూడా తలెత్తుతున్నాయని వైద్య నిపుణులు తెలిపారు. ఇది కంటి నుంచి మొదలుకుంటే గుండె, ఊపిరితిత్తులు, మెదడు ఇలా అన్ని ముఖ్య అవయవాలపై కూడా ప్రభావం చూపుతున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా చెవిపై కూడా ఒమిక్రాన్ ప్రభావం చూపుతున్నట్లు శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. ఒమిక్రాన్ బాధితులను చెవి సమస్యలు వేధిస్తున్నట్లు వెల్లడించారు.

కరోనా, ఒమిక్రాన్ బాధితులపై స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం నిపుణులు పలు పరిశోధనలు చేశారు. అయితే ఒమిక్రాన్ సోకిన వారు చెవిలోపల వివిధ రకాల ఇన్ఫెక్షన్లకు గురవుతున్నారని తెలిపారు. చెవినొప్పి, రింగింగ్, విజిల్ వంటి శబ్ధాలు వేధిస్తున్నాయని బాధితులు చెప్పినట్లు వెల్లడించారు. ఈ సమస్యలు ఎక్కువగా వ్యాక్సిన్ వేసుకున్న వారిలోనే గుర్తించినట్లు చెప్పారు. అయితే వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదిస్తే మంచిదని ఈ సందర్భంగా సూచిస్తున్నారు.

చెవి చాలా సున్నితమైన అవయవం కాబట్టి... సొంత ప్రయోగాలు చేవయద్దని వైద్య నిపుణులు అంటున్నారు. వినికిడి సమస్యలు, ఇతర చెపి సమస్యలు ఉన్నవారికి ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే చెవి వైద్య నిపుణుడి సంప్రదించాలని సూచిస్తున్నారు. కాగా ఒమిక్రాన్ ప్రభావం తక్కువగానే ఉన్నప్పటికీ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే ఇది డేంజరస్ కాకపోయినా ముఖ్య అవయవాలపై ప్రభావం చూపుతోందని వైద్యులు అంటున్నారు.

భారతదేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. 24 గంటల్లో మూడు లక్షల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇందులో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బాధితులు కూడా అధికంగానే ఉన్నారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో ఆంక్షలు అమలు చేస్తున్నారు. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. సభలు, సమావేశాలు వంటి వాటిని నిషేధిస్తున్నారు.