Begin typing your search above and press return to search.

ఒమిక్రాన్ ఊపిరి పీల్చుకో..

By:  Tupaki Desk   |   2 Dec 2021 1:34 PM GMT
ఒమిక్రాన్ ఊపిరి పీల్చుకో..
X
ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ గురించి దక్షిణాఫ్రికా మరో సంచలన విషయాన్ని బయటపెట్టింది. ఒమిక్రాన్ సోకినవారిలో స్వల్ప లక్షణాలు ఉన్నాయని సంబరపడాల్సిన అవసరం లేదని దక్షిణాఫ్రికాకు చెందిన శాస్త్రవేత్తలు హెచ్చరించారు. తాజాగా శాస్త్రవేత్తలు చట్టసభ్యులకు సమర్పించిన నివేదికలు పలు విషయాలను పేర్కొన్నారు. ఇది ఎక్కువగా యువతలో సోకే అవకాశం ఉందని, దీని తీవ్రరూపం ఇంకా మొదలు పెట్టలేదని అందులో పేర్కొన్నారు. ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో యువతే ఎక్కువగా ఉన్నారని, అయితే వారు వ్యాధి కారకాలైనందను వారిలో లక్షలణాలు స్వల్పంగా ఉన్నాయన్నారు. వృద్ధులకు సోకడం ఇప్పుడే ప్రారంభమైందని ఆ నివేదికలో పేర్కొన్నారు.

దక్షిణాఫ్రికాలో ఈనెల 25న కొత్త వేరియంట్ బి.1.1.529ను గుర్తించినట్లు దక్షిణాఫ్రికా ప్రభుత్వం వెల్లడించింది. ఆ తరువాత ఇది మెల్లగా ఇతర దేశాలకు పాకింది. ప్రస్తుతం 29 దేశల్లో ఒమిక్రాన్ వేరియంట్ ను గుర్తించారు. ఇప్పటికే ఒమిక్రాన్ ప్రభావంతో ప్రపంచ మార్కెట్లు కుప్పకూలాయి. దీంతో మెల్లగా కొన్ని ప్రభుత్వాలు ఆంక్షల్లోకి జారుకుంటున్నాయి. దక్షిణాఫ్రికా నుంచి ఇతర దేశాలకు వెళ్లే విమానాలను రద్దు చేశారు. అయితే మరికొన్ని రోజులుతరువాత వైరస్ తీవ్రతను గుర్తించే అవకాశం ఉందన్నారు.

అయితే చాలా దేశాలు వ్యాక్సిన్ల ప్రభావంతో రోగనిరోధక శక్తి ఉండడంతో ఒమిక్రాన్ ప్రభావం అంతగా ఉండకపోవచ్చని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. జినోమిక్స్ ఇనిస్టిట్యూట్ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ రిచర్డ్ లెస్సెల్స్ మాట్లాడుతూ ‘కొత్తగా పుట్టుకొస్తన్న వేరియంట్ వ్యాక్సిన్ తీసుకోని వారిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అలాగే అనారోగ్యానికి గురైన వారికి సోకే అవకాశం ఉంది. కానీ రెండు డోసుల వ్యాక్సినేషన్ తీసుకున్నవారిలో ప్రభావం ఉండకపోవచ్చని అన్నారు.

కానీ దక్షిణాప్రికాలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రతిరోజు రెట్టింపుతో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మంగళవారం 4,337 కేసులు నమోదవగా.. బుధవారం 8,516 కేసులు వచ్చాయని అంటువ్యాధుల నివారణ సంస్థ తెలిపింది. అయితే ఇవి ఎక్కువగా సమూహాలున్న ప్రదేశాల్లో పెరిగాయి. అంతేకాకుండా ఇప్పడిప్పుడే వృద్ధులకు కూడా సోకడం ప్రారంభమైందని ఎన్ఐసీడీ చీఫ్ మెచెల్లీ గ్రూమే అన్నారు.

దీంతో ఈ వేరియంట్ వ్యాధినిరోధకతను తప్పించుకునే అవకాశాలున్నాయని అంటున్నారు. వ్యాధి కారకాల క్రిములను అడ్డుకునే టీ కణాల వంటి శరీర ఇతర రక్షణ వ్యవస్థలు ఇప్పటికీ ప్రభావంతంగా ఉండవచ్చని అనుకున్నా తీవ్రమైన వ్యాధులున్నవారిలో వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడే ఇది వ్యాధినిరోధక శక్తికి భయపడుతుందని చెప్పలేమని అంటున్నారు.

మరోవైపు దక్షిణాఫ్రికాలో చైనాతో పోలిస్తే వ్యాక్సినేషన్ తక్కువగా ఉంది. ఈ దేశంలో ఒకటో వంతు జనాభాకు కూడా వ్యాక్సినేషన్ పూర్తి కాలేదు. ఆఫ్రికా ఖండంలోని మొత్తం 1.6 కోట్ల బిలియన్ల మంది జనాభాలో 6.7 శాతం మంది మాత్రమే వ్యాక్సినేషన్ పూర్తయింది. కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్లోని 100 మిలియన్ల జనాభాలో 0.1 శాతం మందికే వ్యాక్సినేషన్ పూర్తయింది.