Begin typing your search above and press return to search.

ఒమిక్రాన్ వల్లనే ఈ లక్షలు..!

By:  Tupaki Desk   |   12 Jan 2022 3:28 AM GMT
ఒమిక్రాన్ వల్లనే ఈ లక్షలు..!
X
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తోంది. వివిధ దేశాల్లో వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. మరణాలు కాస్త తగ్గు ముఖం పట్టిన సరే.. కేసులు పెరుగుదల మాత్రం తేడా లేదు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 27 లక్షల కొత్త కేసులు వెలుగు చూసినట్లు గణాంకాలు చెప్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నమోదు అయ్యే కేసుల్లో సగానికి పైగా కేసులు అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, భారత్ ల నుంచి వస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు చెప్తున్నారు.

ముఖ్యంగా అమెరికాలో వైరస్ కేసుల సంఖ్య భారీ స్థాయిలో నమోదు అవుతుంది. ఈ రోజు అగ్రరాజ్యం లో సుమారు ఆరు లక్షల డెబ్బై వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు ఫ్రాన్స్ లో మూడు లక్షల అరవై వేల కొత్త కేసులు వెలుగు చూసినట్లు ఆ దేశ అధికారులు తెలిపారు. మరో వైపు ఇటలీలో రెండు లక్షలకు పైగా కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాతి స్థానంలో భారత్ ఉంది. స్పెయిన్, అర్జెంటీనా లో కూడా వైరస్ కేసులు లక్షకు పైగా వెలుగు చూశాయి.

అయితే మన దేశంలో కరోనా కేసులు భారీగా వెలుగు చూసేందుకు కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రధాన కారణం అని నిపుణులు అంటున్నారు. కొత్త వేరియంట్ వ్యాప్తి వల్లనే భారత్ లో కరోనా కేసులు సునామీలా అంతకంతకు పెరుగుతున్నాయని చెప్తున్నారు. ఇదే విషయాన్ని మన దేశంలోని నేషనల్‌ టెక్నికల్‌ ఆడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యూనైజేషన్‌ సభ్యులు కూడా వెల్లడించారు. ముఖ్యంగా ఈ ఫోరానికి చెందిన కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌కే అరోరా కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించారు. ఇప్పటివరకు నమోదు అయిన కేసులు ఒమిక్రాన్ వేరియంట్ తో పాటు దాని వ్యాప్తికి కారణం అయ్యే బీఏ1 అనే ఉపరకం కూడా ఉన్నట్లు జీనోమ్ సీక్వెన్సింగ్‌ పరీక్షల్లో తేలింది.

ఒమిక్రాన్ వ్యాప్తి మన దేశంలో చాలా రాష్ట్రాల్లో తక్కువగా ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో అయితే మరీ తక్కువ కేసులు నమోదు అవుతున్నట్లు పేర్కొన్నారు. గతంలో వెలుగు చూసిన డెల్టా వేరియంట్ కేసులు ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. గతేడాది వెలుగు చూసిన డెల్టా వేరియంట్ కేసులు సుమారు 90 శాతానికి పైగా నమోదు అయినట్లు పేర్కొన్నారు. అయితే ఈ కేసుల సంఖ్య నవంబర్ నాటికి సగానికి పైగా తగ్గినట్లు వెల్లడించారు.

ఇదే క్రమంలో డెల్టా ప్లస్ కేసులు 50 శాతానికి పైగా నమోదు అయినట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం వైరస్ కేసుల సంఖ్య మెట్రో నగరాల్లో ఎక్కువగా ఉందని తెలిపారు నిపుణులు. వీటిలో కూడా దిల్లీ, ముంబయి, కోల్‌కతా పుణె, అహ్మదాబాద్ వంటి నగరాల్లో మరీ ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు.