Begin typing your search above and press return to search.

రాత్రిళ్లు చెమట పోస్తుందా? అయితే.. ఒమిక్రాన్ కావొచ్చు

By:  Tupaki Desk   |   17 Dec 2021 4:46 AM GMT
రాత్రిళ్లు చెమట పోస్తుందా? అయితే.. ఒమిక్రాన్ కావొచ్చు
X
ప్రపంచానికి కొత్త కంగారుగా మారిన ఒమిక్రాన్.. అంతకంతకూ విస్తరిస్తోన్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఈ వేరియంట్ మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వేరియంట్ అత్యంత ప్రమాదకరమైనదిగా పలువురు అభివర్ణిస్తుంటే.. అంత సీన్ దీనికి లేదని.. దాన్ని మరీ అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదన్న వాదనల్ని వినిపిస్తున్నారు. డెల్టా వేరియంట్ తో పోలిస్తే.. ఈ వేరియంట్ అంత ప్రమాదకరమైనది కాదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.

డెల్టా వేరియంట్ బారిన పడినోళ్లకు తక్షణం ఆసుపత్రి అవసరం ఏర్పడటం.. మరణాల రేటు ఎక్కువగా ఉండటం తెలిసిందే. ఈ వేరియంట్ తో పోలిస్తే.. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా ప్రాణ నష్టం చాలా చాలా తక్కువగా ఉండటం తెలిసిందే.

ఈ వేరియంట్ వెలుగు చూసిన రెండు.. మూడు వారాల తర్వాత ప్రపంచంలో తొలి మరణం నమోదు కావటం తెలిసిందే. కాకుంటే.. ఈ వేరియంట్ తో తీవ్ర అనారోగ్యానికి గురి కావటం ఒక పెద్ద ఇబ్బందిగా చెప్పాలి. అంతే కాకుండా.. చాలా వేగంగా విస్తరించే గుణం ఉందని చెబుతున్నారు.

అయితే.. ఈ వాదనకు మరో కౌంటర్ వాదన కూడా వినిపిస్తోంది. ఇప్పటివరకు ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న దేశాల్లో వ్యాక్సినేషన్ అంత ఎక్కువగా జరగలేదన్న విశ్లేషణలు ఉన్నాయి.

ఆయా దేశాలతో పోలిస్తే.. మనదేశంలో వ్యాక్సినేషన్ ఎక్కువగా జరిగిందని చెప్పాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. అసలు ఒమిక్రాన్ బారిన పడినోళ్లు ఎలాంటి ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటారు? అన్నది ప్రశ్నగా మారింది.

దీనికి సమాధానంగా దక్షిణాఫ్రికాకు చెందిన నిపుణులు కీలక సమాచారాన్ని వెల్లడించారు. ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు ఎలా ఉంటాయన్న దానిపై స్పష్టమైన వివరాలు అందుబాటులో లేని నేపథ్యంలో దక్షిణాఫ్రికాకు చెందిన వైద్యుడు ఒకరు కీలక సమాచారాన్నివెల్లడించారు.

ఈ వేరియంట్ బారిన పడిన వారు డెల్టా వేరియంట్ లక్షణాలకు భిన్నంగా ఉంటాయని చెబుతున్నారు. ఈ వేరియంట్ బారిన పడిన వారు రాత్రిళ్లు విపరీతమైన చెమటలతో ఇబ్బంది పడుతున్నట్లుగా గుర్తించినట్లు చెప్పారు.

కొవిడ్ అన్నంతనే దాని లక్షణాలుగా చెప్పే దగ్గు.. ముక్కు కారణం.. కళ్లల్లో నుంచి నీళ్లు రావటం.. తీవ్రమైన జ్వరం.. గొంతు నొప్పి లాంటివి ఒమిక్రాన్ బాధితుల్లో కనిపించవని చెబుతున్నారు. డెల్టా వేరియంట్ లక్షణాలకు భిన్నంగా బాధితుల్లో తీవ్రమైన తలనొప్పి.. ఒళ్లు నొప్పులు.. స్వల్పంగా జ్వరం.. అలసట.. గొంతులోదురద లాంటి లక్షనాలు కనిపిస్తాయని చెబుతున్నారు.

ఈ వేరియంట్ ను మొదటిసారి గుర్తించిన డాక్టర్ ఏంజెలిన్ కాట్టీ.. ఈ వేరియంట్ బారిన పడిన రోగులు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యల్ని ఆయన వివరిస్తున్నారు. కొవిడ్ కేసులు నమోదైన కొత్తల్లో.. ఈ మహమ్మారి బారిన పడినోళ్లలో వాసన కోల్పోయే లక్షణం ఉండటం తెలిసిందే. ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడినోళ్లు ఈ లక్షణం అస్సలు కనిపించదని చెబుతున్నారు.