Begin typing your search above and press return to search.

ఒమిక్రాన్ దెబ్బకు వణికిపోతున్న యూరప్

By:  Tupaki Desk   |   19 Dec 2021 4:39 AM GMT
ఒమిక్రాన్ దెబ్బకు వణికిపోతున్న యూరప్
X
యూరప్ దేశాలు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దెబ్బకు వణికిపోతున్నాయి. తాజాగా ఇంగ్లాండ్ లో రోజుకు సుమారు 95 వేల కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. పోయిన నెలతో పోల్చుకుంటే తాజా కేసులు 30 శాతం పెరుగుతున్నట్లు ప్రభుత్వం ఆందోళన పడుతోంది. దీంతో లండన్ నగరంలో ముందుగా అనధికార ఎమర్జెన్సీని అమలు చేయడం మొదలైపోయింది. బ్రిటన్లోని ఆసుపత్రుల్లో కూడా కరోనా వైరస్ కారణంగా ఆసుపత్రుల్లో చేరుతున్న రోగుల సంఖ్య బాగా పెరుగుతోంది.

బ్రిటన్ సంగతి ఇలాగుంటే ఆస్ట్రియా, డెన్మార్క్, ఐర్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో కూడా కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్ లేదా ఒమిక్రాన్ వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు ఆయా దేశాలు ఎక్కడికక్కడ ముందు జాగ్రత్తగా ఎమర్జెన్సీ నిబంధనలను అమల్లోకి తెస్తున్నాయి. పబ్లిక్ ప్లేసులపై ముందుగా ఆంక్షలు విధిస్తున్నాయి. రెస్టారెంట్లు, మ్యూజియంలు, పబ్బులు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో భౌతిక దూరం పాటించడం, మాస్క్ ధరించటాన్ని కఠినంగా అమలు చేస్తున్నాయి.

డిసెంబర్ 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరగబోయే క్రిస్మస్ వేడుకలే చాలా దేశాల ప్రభుత్వాలను కలవరపరుస్తున్నాయి. క్రిస్మస్ సందర్భంగా పెద్ద సంఖ్యలో జనాలు చర్చిల్లో గుమిగూడకుండా ఎలా నిరోధించాలో ప్రభుత్వాలకు అర్ధం కావడం లేదు. క్రిస్మస్ వేడుకలకు దూరంగా ఉండమని జనాలపై నిర్బంధం విధిస్తే పబ్లిక్ ఎలా రియాక్టవుతారనే విషయం అర్ధంకాక ప్రభుత్వాలు నానా అవస్తలు పడుతున్నాయి. అందుకనే ముందుజాగ్రత్తగా క్రిస్మస్ వేడుకలకన్నా ప్రజల ప్రాణాలే ఎక్కువని అర్ధం వచ్చేలాంటి బోర్డింగులను పై దేశాలు పబ్లిక్ ప్లేసుల్లో ఏర్పాటు చేస్తున్నాయి.

దేశంలోని జనాలందరికీ రెండు కోవిడ్ టీకాలు వేయించటం, చిన్న పిల్లలకు కూడా టీకాలు వేయించే విషయంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయా ప్రభుత్వాలు స్పష్టం చేస్తున్నాయి. రాత్రి 8 గంటల నుండి నుండి ఉదయం 6 గంటల వరకు ముందు జాగ్రత్తగా పై దేశాల్లోని కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించాయి. అవసరమైతే కేసుల తీవ్రతను బట్టి ఉదయం పూట కూడా కర్ఫ్యూ లేదా లాక్ డౌన్ విధించటం ఖాయమంటూ ప్రకటించి జనాలను మానసికంగా సిద్ధం చేస్తున్నాయి. మొత్తానికి ఏదో ఒక కొత్త వేరియంట్ కారణంగా యావత్ ప్రపంచం అల్లాడిపోతోంది.

యూరప్ అంతటా ఆంక్షలు, భయాలు

కేసుల సంఖ్య పెరగడంతో, ఫ్రాన్స్, సైప్రస్ మరియు ఆస్ట్రియాలో అప్రమత్తమైన మంత్రులు ప్రయాణ పరిమితులను కఠినతరం చేశారు. పారిస్ తన నూతన సంవత్సర పండుగ బాణాసంచా కాల్చడాన్ని రద్దు చేసింది. డెన్మార్క్ థియేటర్లు, కచేరీ హాళ్లు, వినోద ఉద్యానవనాలు మరియు మ్యూజియంలను మూసివేసింది. ఐర్లాండ్ పబ్‌లు మరియు బార్‌లపై కర్ఫ్యూ మరియు ఇండోర్ మరియు అవుట్‌డోర్ ఈవెంట్‌లకు పరిమిత హాజరు.

లండన్ మేయర్ సాదిక్ ఖాన్ కేసుల గురించి అధికారిక ఆందోళన వ్యక్తపరిచారు. ఐరిష్ ప్రధాన మంత్రి మైఖేల్ మార్టిన్ దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో జీవితాలను మరియు జీవనోపాధిని రక్షించడానికి కొత్త ఆంక్షలు అవసరమని చెప్పారు. పాక్షిక లాక్‌డౌన్‌ను విస్తరించాలని సిఫారసు చేసిన నిపుణుల బృందం నుండి సలహాలను చర్చించడానికి నెదర్లాండ్స్‌లోని ప్రభుత్వ మంత్రులు శనివారం సమావేశమయ్యారు

ప్రపంచ ఆరోగ్య సంస్థ శనివారం నివేదించిన ప్రకారం, కరోనావైరస్ యొక్క ఓమిక్రాన్ వేరియంట్ ఇప్పటికి 89 దేశాలలో కనుగొనబడింది. ఇప్పటికే ఉన్న కోవిడ్-19 వ్యాక్సిన్‌లు దానికి వ్యతిరేకంగా ఎంత ప్రభావవంతంగా ఉన్నాయి, ఈ వేరియంట్ తీవ్రమైన అనారోగ్యాన్ని కలిగిస్తుందా అనే దానితో సహా ఓమిక్రాన్ గురించిన ప్రధాన ప్రశ్నలకు సమాధానం లేదని డబ్లు హెచ్ వో పేర్కొంది.