Begin typing your search above and press return to search.

కర్టాటక ఆంక్షలను తెలంగాణ అమలు చేయనుందా..?

By:  Tupaki Desk   |   22 Dec 2021 8:30 AM GMT
కర్టాటక ఆంక్షలను తెలంగాణ అమలు చేయనుందా..?
X
ఒమిక్రాన్ భయం రోజురోజుకు పెరుగుతోంది. కేసుల పెరుగుదలలో వేగం పుంజుకోవడంతో సర్వత్రా ఆందోళన మొదలైంది. మొదట్లో ఒమిక్రాన్ తో భయపడాల్సిన పనిలేదని అనుకున్నా.. రోజురోజుకు కేసులు పెరుగుతుండడంతో పాటు మరణాల సంఖ్య కూడా పెరగడం కలకలం రేపుతోంది. దేశ వ్యాప్తంగా 200కుపైగా కేసులు నమోదయ్యాయి. ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

ఈ నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం కావాలని సూచిందింది. దీంతో కర్ణాటక రాష్ట్రంలో ఆంక్షలను మొదలు పెట్టింది. హైదరాబాద్లోని టోలి చౌక్ ప్రాంతాన్ని కంటోన్మెంట్ జోన్ గా ప్రకటించారు. దీంతో మళ్లీ పాత రోజులు వస్తున్నాయా..? అనే భయం పుట్టుకుంది.

ఎట్టి పరిస్థితుల్లో లాక్డౌన్ పెట్టే ఆలోచన లేదని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించకున్నా కేసులు పెరుగుతున్న ప్రాంతాల్లో కట్డడి చేయాల్సిన అవసరం ఉందని కేంద్రం తెలుపుతోంది. దీంతో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఒమిక్రాన్ పెరుగుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర, ఢిల్లీమొదటి రెండు స్థానాలుండగా మూడో స్థానంలో తెలంగాణ ఉంది. కర్ణాటకలో ఒమిక్రాన్ ప్రారంభమైనా ఇప్పటికే ఆంక్షలు విధించారు. అయితే అనుమానితులను మాత్రం పరీక్షిస్తున్నారు.

ఈనేపథ్యంలో న్యూఇయర్ వేడుకలపై ఇప్పటి వరకు వస్తున్న వార్తలు నిజమయ్యాయి. ఒమిక్రాన్ కేసులు పెరిగితే న్యూఇయర్ వేడుకలను బ్యాన్ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. ఇందులో భాగంగా కర్ణాటక ఆ విషయంలో ముందే చర్యలు తీసుకుంది. డిసెంబర్ 30 నుంచి నాలుగు రోజులపాటు అంటే జనవరి 2 వరకు న్యూ ఇయర్ వేడుకలను బ్యాన్ చేసింది.

ఈ నాలుగు రోజుల పాటు ఎక్కడా వేడుకలు నిర్వహించరాదని సీఎం ప్రకటించారు. అయితే 100 మంది ఉండాల్సిన చోట 50 మందితో భౌతిక దూరం పాటించాలన్నారు. కానీ న్యూఇయర్ వేడుకల్లో భౌతిక దూరం ఎలా సాధ్యమవుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఒమిక్రాన్ పెరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. ఇప్పటికే ఇక్కడ 20కి పైగా కేసులు నమోదయ్యాయి. కేసులు ఎక్కువగా ఉన్న హైదరాబాద్లోని టోలీచౌక్ ను కంటోన్మెంట్ జోన్ గా ప్రకటించారు. ఇక ఇటీవల సిరిసిల్లకు చెందిన దుబాయ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చింది. అయితే ఆ వ్యక్తిని వెంటనే టిమ్స్ కు తరలించారు. అయితే అతను ఎవరెవరితో కలిశారో వారి నుంచి శాంపిల్స్ సేకరిస్తున్నారు. దీంతో మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ ఇంకొన్ని ప్రాంతాల్లో ఇలాగే కేసులు పెరిగితే న్యూఇయన్ వేడుకలపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని అంటున్నారు.

గత సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం న్యూఇయర్ వేడుకలపై నిషేధం విధించింది. ఆ సమయంలో కేంద్ర ఎలాంటి లాక్డౌన్ ప్రకటించకపోయినా ఆ బాధ్యతలను రాష్ట్రాలకు వదిలేసింది. దీంతో తెలంగాణలో కొన్ని రోజుల పాటు 4 గంటల పాటు సడలింపు ఇచ్చి మిగతా సమయమంతా లాక్డౌన్ ప్రకటించారు. అయితే ఈసారి న్యూఇయర్ వేడుకలపై మరోసారి ప్రభుత్వం ఆంక్షలు విధించనుందా..? అనే చర్చ సాగుతోంది. ఒకవేళ కేసుల పెరుగుదల ఉండే అదే కావచ్చని అభిప్రాయపడుతున్నారు.

అయితే ఇప్పటి వరకు సామాజిక వ్యాప్తి జరగలేదని, విదేశాల నుంచి వచ్చిన వారిలో మాత్రమే ఒమిక్రాన్ లక్షణాలు గుర్తించామని అంటున్నారు. కాని సామాజిక వ్యాప్తి మొదలైతే మళ్లీ పాతరోజులు రానున్నాయని అంటున్నారు. కానీ ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే మరో వారం రోజుల పాటు ఏం జరుగుతుందనేది చూడాలి..