Begin typing your search above and press return to search.

అమెరికాను కుదిపేస్తున్న ఒమిక్రాన్: ఒక్కవారంలోనే 73.2 శాతం పెరుగుదల

By:  Tupaki Desk   |   21 Dec 2021 7:18 AM GMT
అమెరికాను కుదిపేస్తున్న ఒమిక్రాన్: ఒక్కవారంలోనే 73.2 శాతం పెరుగుదల
X
మొన్నటి వరకు ఒమిక్రాన్ చాపకింద నీరులా విస్తరిస్తుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు జెట్ స్పీడులా వ్యాపిస్తోంది. కరోనా మొదటి వేరియంట్ లాగే ఒమిక్రాన్ ముందుగా కాస్త ప్రభావం చూపకపోయినా ఆ తరువాత అత్యంత వేగంగా మనుషులకు సోకుతోంది. భారతదేశంలో ఇప్పటి వరకు 200 ఒమిక్రాన్ కేసులను గుర్తించారు.

అత్యధికంగా మహారాష్ట్ర, ఢిల్లీలో 54 చొప్పునకేసులు నమోదయ్యాయి. ఇక దక్షిణాఫ్రికాలోని మొదలైన ఒమిక్రాన్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు 89 దేశాల్లో ఒమిక్రాన్ విస్తరించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా మొన్నటి వరకు 10 లోపు ఉన్న కేసులున్న యూఎస్ లో ఇప్పుడు ఒక్కవారంలోనే అమాంతం పెరిగాయి.

యూనిటైడ్ స్టేట్స్ ‘సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(సీడీసీ)’ తాజా నివేదిక ప్రకారం డిసెంబర్ 11 నాటికి ఒమిక్రాన్ కేసులు 12.6 శాతం మాత్రమే పెరిగాయి. కానీ 18వ తేదీ వరకు 73.2 శాతం పెరిగినట్లు తెలిపింది. ఈనెల మొదటి వారంలో 0.7 శాతం పెరుగుదల ఉన్న కేసులు ఒక్కవారంలో అమాంతం పెరిగాయి.

దేశంలో మొట్టమొదటిసారిగా డిసెంబర్ 1న కాలిఫోర్నియాలో ఒమిక్రాన్ కేసును కొనుగొన్నారు. కానీ ఇప్పుడు 48 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. అయితే రోగనిరోధక శక్తి ఉన్నవారు కొత్త వేరింట్ తో ఎక్కువగా ఆసుపత్రికి వెళ్లే ప్రమాదం నంచి తప్పించుకుంటున్నారని అంటున్నారు.

ఇదిలా ఉండగా అమెరికాలో మొదటి వేరియంట్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆసుపత్రుల్లో చేరిన వారి సంఖ్య పెరుగుతుండడంతో పాటు మరణాలు కూడా ఎక్కువగానే నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు గూమిగూడి ఉండే కార్యక్రమాలను ఇప్పటికే ప్రభుత్వం రద్దు చేసింది. స్పోర్ట్స్, గేమ్స్ నిర్వహించుకోవడానికి అనుమతి నిరాకరిస్తోంది. మరోవైపు పాఠశాలలను కూడా మూసివేయించి ఆన్ లైన్ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వ ఆదేశిస్తోంది.

దేశంలో ప్రస్తుతం 1,30,000 కొత్త కేసులు నమోదవుతున్నాయి. గత వారంతో పోలిస్తే 10 శాతం పెరిగిందని సీడీసీ తెలిపింది. సగటున 1,180 మంది మరణిస్తున్నట్లు పేర్కొంది. ప్రతి రోజూ 7,800 కొత్తవారు ఆసుపత్రిలో చేరుతున్నట్లు తెలిపింది. గత వారంతో పోలిస్తే ఇది 4.4 శాతం పెరిగిందని సీడీసీ తెలిపింది. న్యూయార్క్ రాష్ట్రంలో 22,000 కంటే ఎక్కువ కేసులతో కొట్టుమిట్టాడుతోంది. లక్షణాలు కలిగి ఉన్నవారు కరోనా టెస్టుల కోసం పరీక్ష కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు.

అయితే క్రిస్మస్ పండుగ పురస్కరించుకొని ఈనెల 23 నుంచి జనవరి 3 వరకు 21 మిలియన్ల మంది అమెరికన్లు ప్రయాణించే అవకాశం ఉందని ట్రాన్స్ పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్(టీఎస్ఏ) తెలిపింది.

ఒక నెల కిందట సగటున రోజుకు 90వేల కేసులు నమోదు కాగా డిసెంబర్లో 30వేలు అధికంగా పెరిగాయి. అంటే రోజుకు లక్షా 30 వేల కేసులు నమోదవుతున్నాయని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తెలిపింది. అయితే భౌతిక దూరం పాటించడం, పెద్ద పెద్ద సమావేశాలను నిరోధించాలని ప్రభుత్వం ప్రజలకు సూచిస్తోంది. ప్రత్యేక అవసరాలు తప్ప గూమిగూడి ఉండే ప్రదేశాలకు వెళ్లొద్దని సూచిస్తున్నారు.

కొవిడ్ మొదటి వేరియంట్ లోఅమెరికా మరణాలు తీవ్రంగా సంభవించాయి. అయితే తాజాగా మరణా సంఖ్య నమోదు కావడంతో మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఒమిక్రాన్ వ్యాప్తి అడ్డుకోలేకపోతున్నారని, ఈ సమయంలో ప్రజలు తమ జాగ్రత్తలు పాటించాలని అంటున్నారు.

అయితే యూరప్ లోని కొన్ని దేశాలు ఇప్పటికే లాక్డౌన్ ప్రకటించారు. అయితే అమెరికాలో క్రిస్మస్ తరువాత లాక్డౌన్ విధించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఒమిక్రాన్ ఏవిధంగా ఎఫెక్ట్ చూపుతుందోనని ఆందోళన చెందుతున్నారు.