Begin typing your search above and press return to search.

అమిత్ షా...లేడీ లీడ‌ర్‌..ప్రైవేట్ మీటింగ్!

By:  Tupaki Desk   |   19 March 2016 6:10 AM GMT
అమిత్ షా...లేడీ లీడ‌ర్‌..ప్రైవేట్ మీటింగ్!
X
అమిత్ షా. ప‌రిచ‌యం అక్క‌ర్లేద‌ని పేరు. వివాదాలు అమిత్‌ షా విష‌యంలో కొత్త కాక‌పోయిన‌ప్ప‌టికీ తాజాగా తెర‌మీద‌కు వ‌చ్చిన ఓ ఆస‌క్తిక‌ర‌మైన ఎపిసోడ్ ఆయ‌న్ను ఇరుకున ప‌డేసే విధంగా ఉంది. పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముప్తీ - బీజేపీ చీఫ్‌ అమిత్ షాల మధ్య ఢిల్లీలో ఓ ప్రైవేట్ మీటింగ్‌ జరిగింది. దీనిపై ఎలాంటి వివ‌రాలు బ‌య‌ట‌కు రాలేదు. ఈ నేప‌థ్యంలో నేషనల్‌ కాన్ఫరెన్స్ నేత - మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా ఫైర్ అయ్యారు.

జ‌మ్మూ కాశ్మీర్‌ లో ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి కొనసాగుతుండగా, పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ - బీజేపీ అగ్ర‌నేత‌లు మాత్రం ముచ్చ‌ట్ల‌తో స‌రిపెడుతున్నార‌ని ఒమ‌ర్ ఎద్దేవా చేశారు. "గతసారి సమావేశమైనపుడు పువ్వులు - శాలువాలు పరస్పరం ఇచ్చి పుచ్చుకున్నామ‌ని అంద‌రికీ తెలిపారు. కానీ ఇప్పుడు జ‌రిగిన‌ సమావేశంపై ఎందుకీ గోప్యత పాటిస్తున్నారు? "అంటూ ఒమర్‌ ట్విట్టర్‌ లో నిల‌దీశారు.

ప్ర‌తిప‌క్ష పార్టీ లక్ష్యంగా చేసుకునేందుకు వచ్చే ఏ అవకాశాన్ని వదిలిపెట్టకుండా ఒమ‌ర్ ఈ కామెంట్ చేశారా లేక‌పోతే మ‌రే ఉద్దేశ‌మైన ఇమిడి ఉందా అనేది ఇపుడు జ‌మ్ము రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చీనీయాంశంగా మారింది. మ‌రోవైపు జమ్మూ కాశ్మీర్‌ లో ప్రభుత్వ ఏర్పాటు విష‌యంలో అదే గంద‌ర‌గోళం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే.