Begin typing your search above and press return to search.

పాక్ లోని ఒక బలుపు చర్య బయటకొచ్చింది

By:  Tupaki Desk   |   20 Jun 2016 4:55 AM GMT
పాక్ లోని ఒక బలుపు చర్య బయటకొచ్చింది
X
ఒక మతానికి చెందిన వారి సెంటిమెంట్లను గౌరవించటం నాగరికుల లక్షణం. అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ.. తమకు నచ్చని మతానికి చెందిన వారి సెంటిమెంట్లను గాయపరిచేలా చేసే ధోరణి కొన్ని కంపెనీల ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి తోలు మందం కంపెనీల వైఖరి కారణంగా లేనిపోని ఉద్రిక్తతలుచోటు చేసుకుంటాయి. తాజాగా అలాంటి పనే చేసిన ఒక పాక్ కంపెనీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

హిందువులు పరమ పవిత్రంగా భావించే ‘‘ఓం’’ గుర్తును పాక్ కు చెందిన ఒక చెప్పుల కంపెనీ అచ్చేయటం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారంపై పాక్ లోని మైనార్టీలైన హిందువులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. టాండో ఆదం ఖాన్ సిటీలో ‘ఓం’ అచ్చేసిన చెప్పుల్ని అమ్ముతున్నారు. దీనిపై పాక్ హిందూ సమాఖ్య అధినేత రమేశ్ కుమార్ తప్పు పట్టటమే కాదు.. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చెప్పుల్ని షాపుల నుంచి వెంటనే తీసేయాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు. హిందువుల సెంటిమెంట్లను దెబ్బ తీసేందుకు ఈ తరహా ప్రయత్నాలు చేస్తున్నారని.. ఇదే మాత్రం మంచి పద్దతి కాదని ఆయన మండిపడుతున్నారు. మరి.. పాక్ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో..?