Begin typing your search above and press return to search.
బతికుండగానే దశదిన కర్మ చేసుకున్న వృద్ధుడు.. రీజన్ తెలిస్తే అవాక్కే!
By: Tupaki Desk | 7 Nov 2022 9:10 AM ISTదశ దిన కర్మ. ఇది అందరికీ తెలిసిందే. వ్యక్తి మరణించిన తర్వాత ఆ వ్యక్తి తాలూకు కుమారులు వారు లేకపోతే.. కుమార్తెల కుటుంబాలు చేసే అపరకర్మ. జీవితంపై ఎంత విరక్తి పుట్టినా.. తన కడుపున పుట్టిన వారిపై ఎంత నమ్మకం లేకపోయినా.. ఏ తండ్రీ కూడా.. తన దశ దిన కర్మను తాను చేసుకున్న ఘటన ఈ దేశం ఇప్పటి వరకు లేదు.
అయితే.. ఇప్పుడు ఇది కూడా జరిగిపోయింది. తాను మరణించాక తన పిల్లలు దినకర్మను సరిగ్గా చేస్తారో లేదో అని అనుమానించిన ఓ వృద్ధుడు తనకు తానే ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాడు. ఊరందరిని పిలిచి భోజనాలు సైతం పెట్టాడు.
ముజఫర్‌పుర్ జిల్లా సక్రా బ్లాక్‌లోని భారతీపూర్ గ్రామానికి చెందిన హరిచంద్ర దాస్ (75) బతికి ఉండగానే తన దినకర్మను స్వయంగా చేసుకున్నాడు. తన దినకర్మను చేయమని ఇంట్లో వాళ్లను అడగగా.. వారందరూ షాక్కు గురయ్యారు.
అలా చేయొద్దని కుటుంబ సభ్యులు సహా గ్రామస్థులు సూచించారు. కానీ ఆయన అందుకు నిరాకరించాడు. దీంతో చేసేదేమీలేక వారు కూడా దినకర్మ చేసేందుకు అంగీకరించారు. హరిచంద్ర దాస్ తన వర్ధంతిని పూర్తి ఆచార వ్యవహారాలతో జరుపుకున్నాడు. అనంతరం రాత్రి భోజనాలు కూడా ఏర్పాటు చేశాడు.
"నా మరణానంతరం కొడుకులిద్దరూ దినకర్మను సరిగ్గా చేస్తారా లేదా అన్న సందేహం వచ్చింది. అందుకే నా దినకర్మను నేనే చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. నేను మతపరమైన స్వభావం గలవాడిని. కాబట్టి, మోక్షాన్ని పొందేందుకు జీవించి ఉండంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిద్దామని నిర్ణయించుకున్నాను.
నా ఇద్దరు కొడుకులు, వేరే రాష్ట్రంలో ఉంటూ కష్టపడి పనిచేస్తున్నారు. నా ఆరోగ్య పరిస్థితి కారణంగా ఇప్పుడు ఏ పని చేయలేను. గ్రామంలో వ్యవసాయం చేస్తే కొద్దిపాటి ధాన్యం వస్తుంది. ఆ డబ్బుతో నా దినకర్మ నేనే చేయించుకుంటున్నా. ఇది తప్పుకాదు. పిల్లలు రేపు చేయగలరో లేరో.. చేయకపోతే మోక్షం రాదుకదా.'' అని పెద్దాయన సర్దిచెప్పుకొంటుండడం విశేషం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.