Begin typing your search above and press return to search.

అత్యధిక కాలం కోవిడ్ బారిన 59 ఏళ్ల వ్యక్తి.. చివరికీ ఏమైదంటే?

By:  Tupaki Desk   |   4 Nov 2022 11:38 AM GMT
అత్యధిక కాలం కోవిడ్ బారిన 59 ఏళ్ల వ్యక్తి.. చివరికీ ఏమైదంటే?
X
చైనాలోని వ్యూహాన్ నగరంలో వెలుగు చూసిన కరోనా మహమ్మరి రెండేళ్లు ప్రపంచాన్ని అతలాకులం చేసింది. ఎంతలా అంటే కరోనా పేరు చెబితే జనం వణికి పోయేవారు. సాటి మనిషి దగ్గినా.. తుమ్మినా కరోనానే అనే భయం ప్రతీ ఒక్కరిలో నెలకొని పోయిందంటే అతిశయోక్తి కాదేమో. నాటి భయంకర పరిస్థితుల నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే బయటికొస్తుంది.

అయితే కరోనా పరిస్థితులు ఎవరూ కూడా అంత ఈజీగా మర్చిపోలేరు. ఈ కాలంలో వైద్యులు తీరిక లేకుండా రోగులకు చికిత్స చేయాల్సి వచ్చింది. వీరి కృషి ఫలితంగా ఎంతో మంది రోగులు కోవిడ్ నుంచి బయటపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఎంతో మంది వైద్యులు కరోనా బారిన పడి వారి విలువైన ప్రాణాలను కోల్పోవాల్సి రావడం బాధాకరంగా మారింది.

కరోనాకు భయపడి చాలా దేశాలు లాక్ డౌన్ పాటించాయి. దీంతో రవాణా వ్యవస్థ మొత్తం కుంటి పడిపోయింది. జనాలు మాస్కులు లేకుండా బయటికి వచ్చే పరిస్థితి లేదు. చేతులకు శానిటైజర్లు.. భౌతిక దూరం పాటిస్తూ ప్రతీఒక్కరూ కరోనాపై పోరులో కలిసి వచ్చారు. ఈ క్రమంలోనే సైంటిస్టుల కృషి ఫలితంగా కోవిడ్ కు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది.

అయితే ఈ మహమ్మరి అల్ఫా.. బీటా.. డెల్లా వేరింట్ల రూపంలో సైంటిస్టులకు సవాల్ విసిరింది. ఆ తర్వాత క్రమంగా కరోనా వేరియంట్లు తమ ప్రభావాన్ని కోల్పోయాయి. దీనికి తోడు ప్రతీఒక్కరు కరోనా ఫస్ట్ డోస్.. సెకండ్ డోస్.. బూస్టర్ డోస్ లు వేయించుకోవడంతో కోవిడ్ నుంచి ప్రజలు క్రమంగా బయటపడ్డారు.

దీంతో గతంలో మాదిరిగానే ప్రజలు మాస్కులు లేకుండానే తిరుగుతున్నారు. పండుగలు.. పబ్బాలు.. పెళ్లిళ్లు.. విందులు వినోదాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు మునుపటి రోజులు వచ్చినప్పటికీ ఒక రోగి మాత్రం కరోనా ఫస్ట్ వేవ్ నుంచి ఈ మహమ్మరిపై పోరాడుతూనే ఉన్నారు. ఏకంగా 411 రోజులపాటు కోవిడ్ తో పోరాడి ఇటీవలే క్షేమంగా బయటపడ్డారు.

బ్రిటన్ కు చెందిన 59 ఏళ్ల వ్యక్తి 2020 డిసెంబర్లో కరోనా బారిన పడగా జనవరిలో పాజిటివ్ గా తేలింది. అయితే ఇతడికి మూత్ర మార్పిడి కారణంగా రోగనిరోధక శక్తి తగ్గినట్లు వైద్యులు తెలిపారు. ఈ రోగికి బీ1 వేరియంట్ సోకినట్లు గుర్తించి వైద్యం అందించారు. అయితే అతనికి సోకింది పెర్సిస్టెంట్ కోవిడ్ ఇన్ ఫెక్షన్ అని తర్వాత తేలింది.

ఈ వైరస్ కోవిడ్ కంటే చాలా భిన్నమైనది వైద్యులు పేర్కొంటున్నారు. ఇమ్యూనిటీ తక్కువగా ఉండే వారిలో పెర్సిస్టెంట్ కోవిడ్ వచ్చే వస్తుందని అంటు వ్యాధులు ప్రత్యేక నిపుణుడు ల్యూక్ స్నెల్ తెలిపారు. ఏదిఏమైనా కరోనా ఫస్ట్ వేవ్ లో కరోనా బారిన పడి 59 ఏళ్ళ వ్యక్తిని వైద్యులు ఎట్టకేలకు వైద్యులు కాపాడారు. దీంతో కరోనాతో అత్యధిక కాలం పోరాడిన వ్యక్తిగా ఆయన నిలిచారని వైద్యులు తెలిపారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.