Begin typing your search above and press return to search.
అతడి పొట్టా.. పాత సామాన్ల షాపా?
By: Tupaki Desk | 17 July 2019 3:08 PM ISTమీరు చదివింది కరెక్టే. ఒకటి కాదు.. రెండు కాదు. ఏకంగా 33 వస్తువుల్ని ఒక వ్యక్తి కడుపు నుంచి తీసిన వైనం విస్మయానికి గురి చేస్తోంది. ఈ ఉదంతం మధ్యప్రదేశ్ లోని ఛతర్పూర్ పట్టణంలో చోటు చేసుకుంది. 30 ఏళ్ల యోగేష్ ఠాకూర్ అనే వ్యక్తి విపరీతమైన కడుపు నొప్పితో బాధ పడుతూ ఆసుపత్రికి వచ్చాడు.
దీంతో.. అతడ్ని పరీక్షించిన వైద్యుడు.. ఎక్స్ రే తీశాడు. అందులో పలు రకాల వస్తువులు కనిపించటంతో అతడి పొట్టకు సర్జరీ చేశారు. సర్జరీలో భాగంగా పొట్టను విప్పి చూస్తే.. అందులో పలు రకాల పెన్నులు.. కోటులు కుట్టే సూదులు.. ప్లాస్టిక్ తో పాటు ఇనుప ముక్కలు కూడా ఉన్నట్లు గుర్తించారు.
అతగాడి పొట్ట నుంచి ఏకంగా 33 వస్తువుల్ని బయటకు తీశారు. ఈ సామాన్లను చూసిన వైద్యులు సైతం అవాక్కు అవుతున్నారు. పొట్టా.. పాత సామాన్ల షాపా అన్నట్లుగా ఉన్న ఈ వస్తువుల్ని మీడియాకు చూపించారు వైద్యులు. దాదాపు రెండు గంటలకు పైనే సర్జరీ తీసి విజయవంతంగా ఈ వస్తువుల్ని బయటకు తీశారు.
సదరు యువకుడు కొంతకాలంగా కొన్ని వస్తువుల్ని చటుక్కున మింగేసే అలవాటు ఉందని.. అయినప్పటికీ ఏమీ కాలేదని.. ఈ మధ్యన మాత్రం తేడా కొట్టి విపరీతమైన కడుపు నొప్పి రావటంతో వైద్యుల వద్దకు వచ్చారు. పరీక్షల్లో భాగంగా వివిధ వస్తువులు కనిపించటంతో అతడికి సర్జరీ చేశారు. ప్రస్తుతం సదరు యువకుడి ఆరోగ్యం బాగుందని.. సర్జరీ నిర్వహించిన వైద్యుడు ఖరె వెల్లడించారు.