Begin typing your search above and press return to search.

గర్భం వచ్చిందని తెలీదు.. పాప పుట్టేసింది

By:  Tupaki Desk   |   19 April 2020 5:00 AM IST
గర్భం వచ్చిందని తెలీదు.. పాప పుట్టేసింది
X
వింతలు.. విడ్డూరాలు అప్పుడప్పుడు వింటుంటాం. ఇలాంటివి ప్రపంచంలో ఏదో మూల జరుగుతున్నట్లుగా వార్తలు వస్తుంటాయి. కానీ.. తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్న ఈ ఉదంతం తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. ఆశ్చర్యంతో నోట మాట రాదంతే. గర్భం వచ్చిందన్న విషయం తెలీని యాభై ఏళ్ల ఒక మహిళ పండంటి పాపకు జన్మనిచ్చిన అరుదైన ఉదంతం అశ్వారావుపేటలో చోటు చేసుకుంది.

ఈ ఉదంతం లోతుల్లోకి వెళితే షాకుల మీద షాకులు తగలటం ఖాయం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని ఒక గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఉదంతంలోకి వెళితే.. ఆమెకు యాభై ఏళ్లు. 33 ఏళ్ల క్రితం పెళ్లైంది. ఇద్దరు కూతుళ్లున్నారు. వారికి పెళ్లిళ్లు కూడా అయ్యాయి. పెద్ద కుమార్తెకు ఇద్దరు పిల్లలు కూడా. పాతికేళ్ల క్రితమే కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స జరిగింది.

శుక్రవారం ఆమెకు కడుపునొప్పి వస్తే.. ట్యాబ్లెట్ వేసుకొంది. టాయిలెట్ కు వెళ్లేందుకు వెళ్లిన ఆమెకు డెలివరీ జరిగి.. శిశువు బయటకు రావటంతో అవాక్కు అయ్యింది. ఈ ఎపిసోడ్ లో మరింత షాకింగ్ అంశం ఏమంటే.. గర్భం వచ్చిందన్న విషయం ఆమెకు కూడా తెలీదు. అలా ఎలా అంటే.. నెలసరి ఆగిపోయి కూడా కొన్నేళ్లు అయ్యింది. అలాంటిది ఏకంగా ఆడపిల్ల పుట్టిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. చివరకుసదరు మహిళ కూడా ఈ షాక్ లోని నుంచి బయటకు రాలేక పోతోంది.

పుట్టిన శిశువు 800 గ్రాములే ఉంది. ఇది జరిగిన వెంటనే తల్లి.. శిశువును 108లో ఆశ్వారావుపేట ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం భద్రాచలానికి పంపారు. అసలీ ఉదంతంలో మిస్టరీ లెక్క తేల్చేపని చేశారు అక్కడి వైద్యుడు హరీశ్. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ జరిగిన సమయంలో కట్ చేసిన గర్భసంచి ట్యూబులు మళ్లీ అతికే వీలు ఉంటుందని.. అలాంటివి అరుదుగా జరుగుతాయని చెబుతున్నారు. నెలసరి ఆగిన తర్వాత కూడా హార్మోన్లు విడుదల అవుతాయని.. ఆ కారణంతోనే గర్భం వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ ఉదంతం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.