Begin typing your search above and press return to search.
‘ఓలా’ సేల్స్.. ఒక్క రోజులో రూ.600 కోట్ల లాభం
By: Tupaki Desk | 17 Sept 2021 8:00 PM ISTఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు డిమాండ్ బాగా పెరిగింది. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు ఇందుకు ఓ కారణంగా ఉండగా, పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడం మంచిదేనని పర్యావరణ వేత్తలు అంటున్నారు. ఎకో ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్‌లోకి రావడమే ఆలస్యం కొనేయాల్సిందే అని జనాలు అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు జోరు మీదున్నాయి. కంపెనీ ఒక్క రోజులోనే ఈ స్కూటర్ల బుకింగ్స్ ద్వారా రూ.600 కోట్లు పొందింది. ఒక్క సెకనుకు నాలుగు స్కూటర్లను కంపెనీ వారు విక్రయించారట. అయితే, ఈ స్కూటర్ ఫీచర్స్ కూడా అంత అత్యద్భుతంగా ఉంటాయట.
సాధారణంగా బైక్స్ ఇళ్లలో ఉండటం కామన్ అయిపోయింది. అయితే, సదరు వెహికల్‌ను ఓన్లీ పురుషులు మాత్రమే వాడుకునే అవకాశం ఉంటుంది. మహిళలకు కొంచెం ఇబ్బందే. ఈ క్రమంలోనే స్కూటీలు వచ్చాయి. ఇవి మగ, ఆడ వారికి అనగా ఇద్దరికీ కంఫర్టబుల్‌గా ఉంటాయి. అయితే, ఈ వెహికల్స్ ఏవైనా కానీ, శిలాజ ఇంధనాల ద్వారా నడవాల్సిందే. ఫలితంగా పొల్యూషన్ బాగా పెరిగిపోయి పర్యావరణ సమతుల్యత దెబ్బతింటున్నది. ఇదే విధంగా ఇంకొన్ని రోజులు కొనసాగితే భవిష్యత్తులో మానవాళి మనుగడనే ప్రశ్నార్థకంగా మారనుంది. ఈ క్రమంలోనే ప్రత్యామ్నాయ మార్గాలపైన దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు. అన్ని కంపెనీలు ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ యూసేజ్‌పైన, ప్రొడక్షన్ పైన దృష్టి పెట్టాలని కోరుతున్నారు. అయితే, కొన్ని కంపెనీలు ఇప్పటికే పర్యావరణ హిత ప్రొడక్ట్స్ పైన కాన్సంట్రేట్ చేస్తున్నాయి.
ప్రొడక్షన్ ప్లస్ మెటీరియల్ ఎకో ఫ్రెండ్లీ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఎలక్ట్రిక్ వెహికల్స్ తెర మీదకు వచ్చాయి. శిలాజ ఇంధనాలకు బదులుగా విద్యుత్ ద్వారా అనగా చార్జింగ్ ద్వారా వాహనాలు నడుస్తాయి. ఇకపోతే ఈ వెహికల్స్ వెయిట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఫలితంగా ప్రతీ ఒక్కరు వీటిని యూజ్ చేసేందుకుగాను ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అదర్ వెహికల్స్‌తో పోలిస్తే వీటి బరువు చాలా తక్కువగా ఉండటంతో పాటు చూడటానికి చాలా సింపుల్‌గా ఉంటాయి.
ఈ నేపథ్యంలోనే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి బాగా పబ్లిసిటీ జరిగింది. దాంతో మార్కెట్‌లోకి ఇంకా రాక ముందరే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ బుకింగ్స్ బాగా జరిగాయి. మార్కెట్‌లో ఈ వెహికల్స్‌కు బాగా డిమాండ్ ఉందని గ్రహించిన ఓలా కంపెనీ ప్రొడక్షన్ కూడా ఫాస్ట్‌గా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఓలా సంస్థ బ్లాగ్ పోస్టులో ఒకే రోజు జరిగిన అమ్మకాల గురించి పేర్కొంది. ఈ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కాస్ట్ రూ.75 వేల నుంచి స్టార్ట్ అవుతుందని సమాచారం. అయితే, రేటు అందరికీ ఒకేలా ఉండకపోవచ్చు. రాష్ట్రం ప్రాతిపదికన రేటు మారుతూ ఉండొచ్చు.
గతంతో పొల్చితే ప్రస్తుతం ప్రజల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్‌పై అవేర్‌నెస్ బాగా పెరిగిందన్న సంగతి జరుగుతున్న అమ్మకాలను బట్టి అంచనా వేసుకోవచ్చు. ఆటోమొబైల్ కంపెనీలు అన్ని కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రొడక్షన్‌పైన దృష్టి పెట్టాలని యోచిస్తున్నాయి. ఈ క్రమంలోనే భవిష్యత్తులో ఓలా కంపెనీకి ధీటుగా పలు కంపెనీలు రానున్నాయి. ఎకో ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రొడక్షన్ పైన అన్ని కంపెనీలు దృష్టి పెడితే మంచిదేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.