Begin typing your search above and press return to search.

చేయిచ్చిన అమెరికా.. పెట్రో ధరకు రెక్కలే..

By:  Tupaki Desk   |   24 Sep 2018 12:01 PM GMT
చేయిచ్చిన అమెరికా.. పెట్రో ధరకు రెక్కలే..
X
పెట్రోల్ రేటు భారత్ లో పరుగులు పెడుతోంది. తాజాగా ముంబైలో లీటర్ పెట్రోల్ ధర దేశ చరిత్రలోనే అత్యధికంగా రూ.90.08 మార్కును అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా బ్రెంట్ క్రూడ్ చమురు బ్యారెల్ ధర 1.93 శాతం పెరిగి 79.75 డాలర్లకు చేరుకుంది. దీనికి తోడు నవంబర్ 4న ఇరాన్ మీద అమెరికా ఆంక్షలు అమల్లోకి వస్తుండడంతో ఆ దేశం ఇప్పటికే ఎగుమతుల మీద కోత విధించింది. ఈ పరిణామం భారత్ పై తీవ్రంగా పడింది. భారత్ కు ఇరాన్ దిగుమతుల కోటా తగ్గించింది. దీంతోపాటు బ్యారెట్ మూడి చమురు పెరగడంతో పెట్రోల్ ధరలు దేశంలో మరింత పెరగడం ఖాయమన్న సంకేతాలు ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

మార్కెట్లో నెలకొన్న ప్రస్తుత సంక్షోభాన్ని నివారించేలా ధరలు తగ్గించాలంటూ సౌదీని అమెరికా కోరినా.. అది నిరాకరించడంతో పరిస్థితి దిగజారుతోంది. బ్యాలెన్స్ చేస్తామన్న అమెరికా మాటలు వట్టివేనని మార్కెట్ లో పెట్రోల్ ధరలకు రెక్కలను బట్టి అర్థమవుతోంది.

2015లో అత్యధికంగా చమురును ఉత్పత్తి చేసిన అమెరికా ఇప్పుడు చేతులెత్తేయడం ప్రపంచవ్యాప్తంగా ధరలపై ప్రభావం చూపుతోంది. ఉత్పత్తి క్రమంలో 1053 రిగ్గులు తగ్గించడంతో పెట్రోల్ ఉత్పత్తి భారీగా పడిపోయింది. మరోవైపు ధరలు అదుపు చేసే విషయంపై చర్చించేందుకు ఓపెక్ దేశాలు భేటి అయ్యాయి. సరఫరా పెంచుతామని కానీ.. ధరలు నిలువరిస్తామని కానీ నిర్ధష్టమైన నిర్ణయాన్ని తీసుకోలేదు. ఈ కారణాల వల్ల సమీప భవిష్యత్తులో మన దేశంలో పెట్రోల్ రేటు లీటర్ కు రూ.100 చేరుకోవచ్చన్న ఆందోళన సర్వత్రా నెలకొంది.