Begin typing your search above and press return to search.
డ్రాగన్ దెబ్బకు మన వంటిట్లో కొత్త మంటలు
By: Tupaki Desk | 27 Sept 2020 2:20 PM ISTరిఫైండ్ అయిల్ కావొచ్చు.. పామాయిల్ కావొచ్చు.. వేరుశెనగనూనె కావొచ్చు. వంటిల్లు అన్న తర్వాత నూనెలు లేకుండా ఊహించుకోలేం. తినే ఆహారంలో వినియోగించే నూనె విషయంలో.. ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటాం. అందులో భాగంగా ఎక్కువమంది సన్ ఫ్లవర్ ఆయిల్ వాడుతుంటారు. కొంతమంది వివిధ రకాల ఆయిల్స్ వాడినా.. సన్ ఫ్లవర్ ఆయిల్ కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంటారు.
తాజాగా ఈ సన్ ఫ్లవర్ ఆయిల్ ధరలు భారీగా పెరిగిపోయాయి. రెండు రోజుల వ్యవధిలో లీటరు రూ.100 ఉన్న ధర కాస్తా ఏకంగా రూ.130కు చేరుకోవటం షాకిస్తోంది. రైతు బజారులో ఈ ధర ఇలా ఉంటే.. చిల్లర దుకాణాల్లో అయితే లీటరుకు ఏకంగా రూ.40 పెరిగిన వైనం షాకింగ్ గా మారింది. ఒక మధ్యతరగతి కుటుంబంలో నెలకు తక్కువలో తక్కువగా నాలుగు కేజీల నుంచి ఐదు కేజీల వరకు వాడేస్తుంటారు. ఈ లెక్కన నెలకు పడే అదనపు భారం రూ.200కు పైనే ఉండటం గమనార్హం.
ఒక్క సన్ ఫ్లవర్ ఆయిల్ ధరలు మాత్రమే కాదు.. వేరుసెనగ.. రైస్ బ్రాన్.. పామాయిల్ ధరలు మండుతున్నాయి. ఇంతకూ ఇంత భారీగా ధరలు ఎందుకు పెరిగినట్లు? దాని వెనుకున్న కారణం ఏమిటన్న విషయాల్ని చూస్తే.. షాకింగ్ నిజాలు బయటకు వస్తాయి. దేశంలో వినియోగించే సన్ ఫ్లవర్ ఆయిల్ లో ఎక్కువ భాగం ఉక్రెయిన్.. రష్యాల నుంచి భారత్ కు దిగుమతి అవుతుంటుంది. జనవరిలో 3.01లక్షల టన్నులు రాగా.. నెల క్రితం మాత్రం 1.58లక్షల టన్నులు మాత్రమే వచ్చింది. తాజాగా ఇది మరింత తగ్గింది. దీంతో.. ధరలు భారీగా పెరిగినట్లు చెబుతున్నారు.
ఇంతకీ రష్యా.. ఉక్రెయిన్ నుంచి రావాల్సిన నూనెలు ఎందుకు రావటం లేదంటే.. దానికి కారణం చైనాగా చెబుతున్నారు. గడిచిన మూడు నెలల్లో 5లక్షల టన్నుల నూనెలు కొనుగోలు చేసే స్థానే 17 లక్షల టన్నుల సన్ ఫ్లవర్ ఆయిల్ ను కొనుగోలు చేయటంతో.. భారత్ రావాల్సిన దిగుమతులు రాలేదు. దీంతో.. ఫ్యూచర్ మార్కెట్ తలకిందులైంది. భారత్ తో నెలకొన్న ఘర్షన వాతావరణ నేపథ్యంలో చైనా ముందుస్తుగా భారీ ఎత్తున నూనెల్ని నిల్వ ఉంచుకుంటుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. చిన్న మాట అనకుండానే భారత్ లోని అన్ని వంటిళ్లకు షాకిచ్చిన డ్రాగన్.. రానున్న రోజుల్లో ఇలాంటి దరిద్రపుగొట్టు ఆలోచనలు ఎన్ని చేస్తుందో చూడాలి.