Begin typing your search above and press return to search.

కోడికత్తి ‘ఫ్యూజన్​ ఫుడ్స్​’ ను ఖాళీచేయిస్తున్న అధికారులు..!

By:  Tupaki Desk   |   15 Nov 2020 3:20 PM IST
కోడికత్తి ‘ఫ్యూజన్​ ఫుడ్స్​’ ను ఖాళీచేయిస్తున్న అధికారులు..!
X
విశాఖపట్టణంలోని సిరిపురం వీఎంఆర్​డీఏ స్థలంలో కొనసాగుతున్న ‘ఫ్యూజన్​ ఫుడ్స్​’ రెస్టారెంట్​ను అధికారులు ఖాళీ చేయించారు. గతంలో విశాఖపట్టణం ఎయిర్​పోర్టు వద్ద జగన్​మోహన్​రెడ్డిపై కోడికత్తితో దాడిజరిగిన విషయం తెలిసిందే. దాడికి పాల్పడ్డ శ్రీనివాసరావు ఎయిర్​పోర్ట్​లో ఉన్న ‘ఫ్యూజన్​ ఫుడ్స్​’ రెస్టారెంట్​లో పనిచేసేవాడు. ఈ రెస్టారెంట్ టీడీపీ నేత హర్షది కావడంతో అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. కోడికత్తి ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.

అయితే ప్రస్తుతం విశాఖపట్టణంలోని వీఎంఆర్​డీఏ స్థలంలో కొనసాగుతున్న ‘ఫ్యూజన్​ ఫుడ్స్​’ అధికారులు ఖాళీ చేయిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ‘విశాఖపట్టణంలోని సిరిపురంలో వీఎంఆర్​డీఏ స్థలాన్ని లీజ్​కు తీసుకొని ఇక్కడ ఫ్యూజన్​ ఫుడ్స్​ రెస్టారెంట్​ను నిర్మించారు. ఈ రెస్టారెంట్​ను నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారు. దీంతో ప్రభుత్వానికి నష్టం వస్తున్నది. అందుకే ఈ రెస్టారెంట్​ను ఇక్కడ నుంచి ఖాళీ చేయిస్తున్నాం ’ అని అధికారులు చెబుతున్నారు. ఈ విషయంపై రెస్టారెంట్ అధినేత, టీడీపీ నేత హర్ష మాట్లాడుతూ.. ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నదని ఆరోపించారు.

2024 వరకు లీజు తీసుకున్నామని ఇప్పుడు చట్టవిరుద్దంగా ఖాళీ చేయిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అతి సన్నిహితుడిగా పేరొందిన హర్ష కుమార్ ఈ ఫ్యూజన్ ఫుడ్ రెస్టారెంట్ యజమాని కావడం గమనార్హం. సిరిపురం జంక్షన్ వద్ద ఉడా నుంచి లీజుకు తీసుకున్న ఆస్తిని టీడీపీ నేత హర్ష రెండింతల అద్దెకు మరొకరికి ఇచ్చాడు. దీంతో అక్రమ లీజుపై ఉక్కుపాదం మోపిన అధికారులు లీజుదారుడిని ఖాళీ చేయించారు.