Begin typing your search above and press return to search.

ఆఫీస్ అసిస్టెంట్ ఐటీ పెండింగ్ రూ.5.4 కోట్లు!

By:  Tupaki Desk   |   19 Dec 2016 12:17 PM GMT
ఆఫీస్ అసిస్టెంట్ ఐటీ పెండింగ్ రూ.5.4 కోట్లు!
X
రూ.5.4 కోట్ల టాక్స్ పెండింగ్ ఉందని - వాటిని తక్షణమే చెల్లించాలని ఐటీ శాఖ నుంచి నోటీసు వచ్చింది ఒక వ్యక్తికి. అలా వచ్చిన నోటీసులు చూసిన ఆ యువకుడు షాక్ తిన్నాడు. అంతేకాదు... ఆదాయపన్నుశాఖ పంపిన నోటీసుల ప్రకారం అతడు నాలుగు కంపెనీలకు యజమాని కూడా! దీంతో హుటాహుటిన స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ కు పరుగెత్తాడు. అదేంటి ఐటీశాఖ నోటీసులు పంపితే పోలీస్ స్టేషన్ కి వెళ్లడం? అక్కడే ఉంది అసలు విషయం.

విషయానికొస్తే... ముంబయిలోని భయందర్‌ అనే ప్రాంతంలోని గణేశ్‌ దేవి నగర్‌ కి చెందిన రవి జైశ్వాల్ (32) అనే యువకుడికి ఆదాయ పన్ను శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో తనకేపాపం తెలియదంటూ థానే ఎస్పీ మహేష్ పాటిల్ ముందు గోడువెళ్లబోసుకున్నాడు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన పోలీసులు రవి జైశ్వాల్ పాన్ కార్డు - ఆధార్ కార్డులను ఉపయోగించుకుని కొందరు నాలుగు బోగస్ కంపెనీలను తెరిచినట్టు గుర్తించారు. ఇంతకూ ఈ రవి జైశ్వాల్ ఏమి చేస్తాడో తెలుసా.. ఒక కంపెనీలో ఆఫీసు అసిస్టెంట్!

అయితే పోలీసుల సమక్షంలో షాక్ నుంచి తేరుకున్న రవి జైశ్వాల్ - ఈ విషయాలపై క్లారిటీగా స్పందిస్తూ... తాను 2008లో రాజేశ్ అగర్వాల్ అనే చార్టెడ్ అకౌంటంట్‌ కి చెందిన కంపెనీలో చేరాననీ, జీతం కోసం బ్యాంకు ఖాతా తెరవాలంటూ తన ఆధార్ - పాన్ కార్డులను తీసుకున్నారని పోలీసులకు తెలిపాడు. అయితే ఇన్ని చేసినా తనకు బ్యాంకు ద్వారా జీతమివ్వలేదనీ చేతికే ఇచ్చేవారని చెప్పాడు. అయితే 2012లో అక్కడ ఉద్యోగం మానేసి వేరే కంపెనీలో చేరానని తెలిపాడు. అప్పటికే విషయం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు అనంతరం అగర్వాల్‌ తో పాటు అతని వ్యాపార భాగస్వామి రాజీవ్ గుప్తా - అగర్వాల్ ఉద్యోగులు జుగులేశ్ గుప్తా - సంతోష్ సింగ్‌లను అరెస్టుచేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/