Begin typing your search above and press return to search.
బహిరంగ ప్రదేశాల్లో నిరవధిక నిరసన కుదరదు!
By: Tupaki Desk | 7 Oct 2020 6:30 PM ISTపార్టీలు.. ప్రజలు, నాయకులు ఇన్నాళ్లు ఎక్కడ పడితే అక్కడ నిరసనలు చేస్తూ ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆంటకం కలిగిస్తున్నారు. జనాల ఇబ్బందులను మాత్రం నిరసనకారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలోనే బహిరంగ ప్రదేశాల్లో నిరవధికంగా నిరసన ప్రదర్శనలు చేయడం..ఆ బహిరంగ ప్రదేశాలను ఆక్రమించుకోవడం కరెక్ట్ కాదంటూ సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. నిరసనల పేరుతో బహిరంగ ప్రదేశాలను.. ప్రజలు ఉపయోగించుకునే ప్రదేశాలను ఆక్రమించుకోవడం సరికాదని ధర్మాసనం కుండబద్దలు కొట్టింది.
బహిరంగ ప్రదేశాల్లో నిరసనలు చేయడం సమర్థనీయం కాదని.. షహీన్ బాగ్ మాత్రమే కాదు.. దేశంలోనే ఏ చోట అయినా నిరసన తెలుపడం కరెక్ట్ కాదని సుప్రీం వ్యాఖ్యానించింది. అలాంటి అడ్డంకులను తొలగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
ప్రజల రాకపోకలను సాగించే హక్కును నిరవధికంగా ఆపడం కరెక్ట్ కాదని.. నిర్ధేశించిన ప్రదేశాలలోనే నిరసన తెలుపాలని సుప్రీం కోర్టు అందరికీ సూచించింది. నిరసన తెలిపే హక్కు ఖచ్చితంగా అందరికీ ఉంటుందని.. రోడ్లను వినియోగించుకు హక్కు తులనాత్మకంగా ఉండాలని సుప్రీం కోర్టు పేర్కొంది.
సీఏఏ బిల్లుకు వ్యతిరేకంగా షహీన్ బాగ్ ప్రాంతంలో నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ నిరసనలతో ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిందని తాజాగా అమిత్ సాహ్ని అనే వ్యక్తి సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు. దీంతో ఇలా బహిరంగ ప్రదేశాల్లో నిరసన తెలుపడం కుదరదని సుప్రీం తీర్పు చెప్పింది.