Begin typing your search above and press return to search.
జమ్మూకశ్మీర్‌లో రెండున్నర లక్షల ఎకరాల భూ కబ్జా..400 మంది నాయకుల ప్రమేయం
By: Tupaki Desk | 29 Nov 2020 9:40 AM ISTజమ్మూకశ్మీర్‌లో లక్షల ఎకరాల భూములు కబ్జాకు గురయ్యాయి. కొంతమంది రాజకీయపార్టీల నేతలు జమ్మూకశ్మీర్‌లో లక్షల ఎకరాలు కబ్జాచేసినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ కబ్జాలో పలువురు రాజకీయనేతల పేర్లు బయటకు వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి అయిన తాజ్ మొహునిద్దీన్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఇప్పటికే కేసు నమోదుచేసింది. మరోవైపు నేషనల్ కాన్ఫెరెన్స్ నాయకుడు ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాల పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. అయితే ఈ ఆరోపణలను వాళ్లు ఖండించారు. కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తమను ఇరికిస్తున్నారని వాళ్లు ఆరోపించారు. జమ్మూ, శ్రీనగర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫీసుల కోసం సేకరించిన భూమి చట్టవిరుద్ధంగా చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. పార్టీ కార్యాలయాల కోసం అంటూ భారీగా భూమిని సేకరించారని ఆరోపణలు వస్తున్నాయి.
రోషిణి చట్టం ప్రకారం సేకరించిన భూముల్లో అక్రమాలు జరిగాయని సమాచారం. ఈ చట్టం ప్రకారం చాలా మంది రాజకీయనాయకులు భూములను కబ్జాచేశారని దర్యాప్తు సంస్థల అధికారులు చెబుతున్నారు. అయితే నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్ధుల్లా ఈ ఆరోపణలు ఖండించారు. తన భూములు రోషిణి చట్టం కిందకు రావు అని ఆయన చెబుతున్నారు.
పీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన హసీబ్ దరాబూ, కాంగ్రెస్ రాష్ట్ర కోశాధికారి కేకే అమ్లా, ఆయన కుటుంబానికి చెందిన మరో ముగ్గురి పేర్లు జాబితాలో ఉన్నాయి. నేషనల్ కాన్ఫెరెన్స్‌కు చెందిన సజ్జద్ కిచ్లూ, హరూన్ చౌధరితోపాటు మరో ఇద్దరి పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. మొత్తంగా దాదాపు 400 మంది పేర్లను కశ్మీర్ పరిపాలనా విభాగం విడుదల చేయడంతో.. దీనిలోని కొందరి పేర్లపై వివాదం చెలరేగింది.
రోషిణి యాక్ట్ అంటే..
ఆక్రమణదారులకు అధికారికంగా భూమిని కట్టబెట్టేందుకు 2001లో రోషిణి చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టంతో ఎందరో కబ్జాదారులు భూమిని క్రమబద్దీకరించుకున్నారు. ఫరూఖ్ అబ్దుల్లా ప్రభుత్వం ఆ చట్టాన్ని తీసుకొచ్చింది. కానీ ఈ చట్టాన్ని 2018లో అప్పటి గవర్నర్ సత్యపాల్ మాలిక్ రద్దు చేశారు. దీంతో ప్రస్తుతం రోషిణి చట్టం కింద భూములు పొందినవారిపై విచారణ సాగించారు. ఈ చట్టం కింద 20,64,972 కనాళ్ల స్థలాన్ని ఆక్రమించినట్టు సమాచారం. ఒక కనాల్ అంటే 505.85 చ.మీ.. అంటే మొత్తం రెండున్నర లక్షల ఎకరాలకు పైనే భూములు కబ్జాకు గురయ్యాయి.
ఈ చట్టం ఆధారంగా చాలా మంది ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు, షాపులు ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు 30,000 మంది లబ్ధి పొందినట్టు సమాచారం.
ఈ భూములపై ప్రస్తుతం విచారణ సాగుతున్నది. జస్టిస్ గీతా మిత్తల్, జస్టిస్ బ్రిజేష్ బిందాల్ సభ్యులుగాగల ధర్మాసనం గత నెలలో విచారణ చేపట్టింది. ప్రస్తుతం రోషిణి చట్టం ప్రకారం భూములు పొందారంటూ పలువురు రాజకీయనాయకుల పేర్లు కూడా బయటకొచ్చాయి. విచారణ పూర్తయ్యాక ఎవరెవరు భూ కబ్జాలకు పాల్పడ్డారన్న విషయంపై క్లారిటీ రానున్నది.