Begin typing your search above and press return to search.

అక్రమ కాలనీలతో పట్టణాభివృద్ధికి ఆటంకం: సుప్రీంకోర్టు

By:  Tupaki Desk   |   27 April 2022 8:00 AM IST
అక్రమ కాలనీలతో పట్టణాభివృద్ధికి ఆటంకం: సుప్రీంకోర్టు
X
దేశవ్యాప్తంగా పలు నగరాల్లో వెలుస్తున్న అక్రమ కాలనీలు పట్టణాభివృద్ధికి పెనుముప్పుగా మారుతున్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అక్రమ కాలనీలు పెరగకుండా రాష్ట్రాలు సరైన ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించింది. నగరాల్లో ఏర్పడుతున్న అక్రమ కాలనీలను అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలు సూచించాలంటూ సుప్రీంకోర్టు బెంచ్ ఆధ్వర్యంలో ఒక సలహా సంఘం ఏర్పాటైంది. ఈ సందర్భంగా అక్రమ కాలనీలపై బెంచ్ సోమవారం పలు వ్యాఖ్యలు చేసింది.

అక్రమ కాలనీలు పెరిగిపోతుండడం వల్ల నగరాలకు పలు సమస్యలు వస్తున్నాయి. హైదరాబాద్, కేరళలో వరదలకు అక్రమంగా వెలిసిన కాలనీలే కారణం. రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని అడ్డుకునేందుకు సరైన ప్రణాళిక చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. లేకపోతే ఇలాంటివి పెరుగుతూనే ఉంటాయన్నారు.

అవసరమైతే అలాంటి వాటి రిజిస్ట్రేషన్లు ఆపేయాలని సుప్రీంకోర్టు సూచించింది. దీనికి సంబంధించి కోర్టు ఆధ్వర్యంలో ప్రశ్నావళి, సర్య్కూలర్ రూపొందించినట్లు తెలిపింది. వీటిని రాష్ట్రాలకు అందజేస్తామని కోర్టు తెలిపింది.

కాగా ఎల్ఆర్ఎస్ వంటి పథకాల వల్ల రియల్ ఎస్టేట్ మాఫియాకు ప్రభుత్వాల అండ లభించినట్లు అవుతోందని పిటీషనర్ జువ్వాడి సాగర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్ లోనూ మరిన్ని అక్రమ కాలనీలు ఏర్పడడానికి ఇది దోహదం చేస్తుందన్నారు.

ఈ విధమైన అక్రమ కాలనీల వల్లే హైదరాబాద్, వరంగల్ నగరాలను గత వర్షాకాలంలో వరదలు ముంచెత్తుతాయని పిటీషనర్ గుర్తు చేశారు.