Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ గెలిచాడు.. నాయ‌కులు ఓడిపోయారు!

By:  Tupaki Desk   |   13 Dec 2021 11:32 AM GMT
జ‌గ‌న్ గెలిచాడు.. నాయ‌కులు ఓడిపోయారు!
X
ఔను! ఇప్పుడు ఎక్క‌డ విన్నా ఇదే మాట వినిపిస్తోంది. నాలుగు రోడ్ల జంక్ష‌న్ల‌లోని టీ కొట్టు.. వీధి చివ‌ర ఉ న్న‌ బ‌డ్డీ కొట్టు.. ఇలా ఏది తీసుకున్నా.. వైసీపీకి చెందిన‌ ఎవ‌రిని క‌దిలించినా.. అంద‌రి నోటా.. ఇదే మాట వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ``జ‌గ‌న్ గెలిచాడు.. నాయకులుగా మేం ఓడిపోయాం`` అనే మాట జోరుగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

మ‌రి దీనికి కార‌ణ‌మేంటి? ఎందుకు? అంటే.. దీని గురించి చెప్పుకొనే ముందు.. కొంత హిస్ట‌రీలోకి వెళ్లాలి. వైఎస్ రాజ‌శేఖ‌రెడ్డి హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో మృతి చెందిన త‌ర్వాత‌.. కాంగ్రెస్‌లో అనూహ్య‌మైన ప‌రిణామం చోటు చేసుకుంది.

వైఎస్ కుమారుడు.. అప్ప‌టి క‌డ‌ప ఎంపీ వైఎస్ జ‌గ‌న్‌కు ముఖ్యమంత్రి పీఠం కట్ట‌బెట్టాలంటూ.. కొంద‌రు ఎమ్మెల్యేలు.. సంత‌కాలు సేక‌రించారు. అయితే, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం .. జ‌గ‌న్‌ను ప‌క్క‌నపె ట్టిన విష‌యం తెలిసిందే.

దీంతో జ‌గ‌న్ ఓదార్పు యాత్ర‌లు ప్రారంభించారు. అయితే.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సొంత మీడియా చేసిన ప్ర‌చారం కార‌ణంగా.. కాంగ్రెస్ దీనిని కూడా వ‌ద్ద‌ని వ‌ర్త‌మానం పంపింది. దీంతో జ‌గ‌న్ త‌న మీడియాలో సెంటిమెంటు ర‌గిలించారని అప్ప‌ట్లోనే ఒక టాక్ న‌డిచింది. అంటే.. ఇక్క‌డ నాయ‌కుల‌ను వాడుకుంటూనే మ‌రోవైపు.. సెంటిమెంటు ద్వారా పుంజుకునే ప్ర‌య‌త్నం చేయ‌డం గ‌మ‌నార్హం.

ఇక‌, ఆ త‌ర్వాత‌.. కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు రావ‌డం.. పార్టీ పెట్ట‌డం, కాంగ్రెస్ నుంచి వ‌చ్చిన వారితో రాజీనామాలు చేయించ‌డం.. తెలిసిందే. అయితే.. నిజానికి వెస్సార్ కాంగ్రెస్ పార్టీకి క్షేత్ర‌స్థాయిలో నిర్మా ణం అంటూ ఏమీ లేదు.

కేవ‌లం వైఎస్సార్ ఫొటో.. ఆయ‌న సానుభూతి.. ఆయ‌నఅనుకూల ఓటు బ్యాంకు ఇవి త‌ప్ప అప్ప‌ట్లో జ‌గ‌న‌కు ఉన్న క్వాలిఫికేష‌న్ మ‌రేమీ క‌నిపించ‌లేదు. ఇక‌, ఆ త‌ర్వాత‌.. రాష్ట్రం విడిపోవ డం... ఈ క్ర‌మంలో 2014 ఎన్నిక‌లు రావ‌డం తెలిసిందే. ఈ ఎన్నిక‌ల్లోనూ పార్టీనిర్మాణం పూర్తికాలేద‌నే చెప్పారు. అయిన‌ప్ప‌టికీ.. 67 స్థానాల్లో వైసీపీ విజ‌యం ద‌క్కించుకుని అక్క‌డితో ఆగిపోయింది.

ఇక‌, గ‌త 2019 ఎన్నిక‌లకు వ‌చ్చే స‌రికి ప్ర‌శాంత్ కిశోర్ టీం.. కొత్త వ్య‌క్తులు ఇంచార్జులుగా వ‌చ్చి వారితో ప‌నిచేసి.. జ‌గ‌న్ పాద‌యాత్ర చేశారు. దీంతో వైఎస్ మాదిరిగా నేను చేస్తాను, చూశాను.. ఒక్క‌సారి ఛాన్స్ ఇవ్వాలంటూ.. ప్ర‌జ‌ల‌ను అభ్య‌ర్థించాడు.

దీంతో టీడీపీకి అనుకూల ఓటు బ్యాంకు కూడా వైసీపీకి ప‌డింది. ఇలా టీడీపీలోకి కీల‌క‌మైన సామాజిక వ‌ర్గం ఓట్లు 35 శాతం వైసీపీకి ప‌డ్డాయ‌ని అంచ‌నా ఉంది. దీనిని బ‌ట్టి.. జ‌గ‌న్ మాట ఒక్క‌సారి ప‌నిచేసింది. ఇక‌, ప్ర‌స్తుతం ఏం జ‌రుగుతున్న‌దో చూద్దాం.

జ‌గ‌న్ గెలిస్తే.. మ‌నం అంతా బాగు ప‌డ‌తాం అని భావించిన వారు. వైఎస్ ను దృష్టి పెట్టుకుని.. వైసీపీని నా పార్టీ అనుకుని ..క‌ష్ట‌ప‌డి ప‌నిచేశారు. జ‌గ‌న్ పాద‌యాత్ర స‌మ‌యంలో సంఘీభావ యాత్ర‌లు కూడా చేశారు.

వారంత‌ట వారే.. వ‌చ్చి.. పార్టీ కోసం శ్ర‌మించారు. దీంతో పార్టీ నిర్మాణం కూడా జ‌రిగి.. అనూహ్య‌మైన విజ‌యం వైసీపీకి సొంతమైంది. అంటే.. జ‌గ‌న్ గెలిచాడు. మ‌రి నాయ‌కుల ప‌రిస్థితి ఏంటి? జ‌గ‌న్ కోసం.. క‌ష్ట‌ప‌డిన వారి ప‌రిస్థితి ఏంటి? అంటే.. వారి ప‌రిస్థితి అగ‌మ్య గోచ‌రంగా మారింది.

పార్టీకో సం క‌ష్ట‌ప‌డిన వారిని ప‌ట్టించుకోవ‌డం లేదు. ఎవ‌రినీ కనీసం ద‌గ్గ‌ర‌కు కూడా రానివ్వ‌డం లేదు. ఆ ఖ‌రుకు.. గెలిచిన పంచాయ‌తీ స‌ర్పంచ్‌ల‌కు కూడా చెక్ ప‌వ‌న్ లేదు. ఎంపీపీలు, జెడ్పీటీసీల‌కు కూడా నిధులు లేకుండా చేశారు. దీంతో గ్రామాల్లో త‌లెత్తుకోలేక పోతున్న ప‌రిస్థితి ఏర్ప‌డింది. అంతేకాదు.. ఇలాంటి ప‌రిస్థితి ఉంటే.. పార్టీ కోసం ఎందుకు ప‌నిచేయాల‌నే ప్ర‌శ్న‌లు కూడా ఎదుర‌వుతున్నాయి.

``జ‌గ‌న్ కోసం .. మేమెంతో క‌ష్ట‌ప‌డ్డాం. ఆయ‌న సీఎం అవ్వాల‌ని .. మేం అనేక ప్ర‌య‌త్నాలు కూడా చేశాం. ఆయ‌న గెలిచారు. కానీ, మమ్మ‌ల్ని ప‌ట్టించుకునే నాథుడు లేరు`` అని వాపోతున్నారు. మ‌రి ఇదే ప‌రిస్థితి కంటిన్యూ అయితే.. వైసీపీకి డేంజ‌ర్ బెల్స్ మోగిన‌ట్టేన‌ని అంటున్నారు ప‌రిశీలకులు.