Begin typing your search above and press return to search.
గతానికి భిన్నంగా ట్రంప్ పై మాజీ అధ్యక్షుడి భారీ ఫైర్
By: Tupaki Desk | 21 Aug 2020 11:30 AM ISTప్రపంచానికి పెద్దన్న అమెరికాలో రాజకీయం కాస్త భిన్నం. మనకు మాదిరి అదే పనిగా చిల్లరగా మాట్లాడుకోవటం ఎక్కువగా కనిపించదు. ట్రంప్ పుణ్యమా అని.. అందుకు భిన్నమైన పరిస్థితి. ఇటీవల కాలంలో అమెరికా అధ్యక్షులుగా వ్యవహరించిన వారిలో ట్రంప్ మాదిరి వివాదాస్పదమైన అధ్యక్షుడు.. అదే పనిగా నోరు పారేసుకున్న ప్రముఖుడు మరెవరూ లేరని చెబుతారు.
తాజాగా అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్న వేళ.. గతానికి భిన్నంగా మాజీ అధ్యక్షులుసైతం ప్రచారంలోకి వచ్చి.. తమ రాజకీయ ప్రత్యర్థిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఘాటు విమర్శలు చేస్తున్నారు. మాజీ అధ్యక్షులు ఎన్నికల ప్రచారంలోకి వచ్చినా.. ఇప్పటిమాదిరి ఫైర్ అయిన ఉదంతాలు పెద్దగా లేవని చెబుతారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా.. తాజాగా ట్రంప్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన మరోసారి అమెరికా అధ్యక్షుడైతే ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తారని మండిపడ్డారు.
అధ్యక్ష పదవి అంటే.. ట్రంప్ కు రియాల్టీ షో లాంటిదన్న వ్యాఖ్య చేసిన ఆయన.. సిక్కులు.. ముస్లింలు.. ఇతర మైనార్టీలు అనుసరిస్తున్న ప్రార్థనా విధానాల్ని అనుమానిస్తున్నారు. మైనార్టీలకు భద్రత కరవైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్ని మార్చకుండా వీటి ద్వారా లబ్థి పొందాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ‘‘మీ ఓట్లను కష్టమైన వ్యవహారంలా మార్చాలని చూస్తున్నారు. మీ ఓట్లు అక్కర్లేదని అంటున్నారు.ఇలా చేసే వారు గెలుపొందుతున్న వారు.. మీ జీవితాల్ని ప్రభావితం చేసే నిర్ణయాల్ని తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆరోగ్య వ్యవస్థ ఎలా ఉందో అందరికి అనుభవంలోకి వచ్చింది’’ అని ఘాటు విమర్శలు చేశారు.
ట్రంప్ విధానాల్ని అంగీకరించని వారంతా అమెరికా వ్యతిరేకుతులు కాదన్న ఒబామా.. ఇలా అయితే.. దేశంలో ప్రజాస్వామ్యం కనుమరుగు అవుతుందన్న ఆందోళన వ్యక్తంచేశారు. స్వేచ్ఛాయుత పత్రికలు శత్రవులు కావని.. దేశంలో రిపబ్లిక్.. డెమొక్రాట్లు అన్న విధానాలు ఉండవని.. అమెరికా విధానాలే ఉంటాయన్న విషయాన్ని మర్చిపోకూడదన్నారు. ‘‘అధ్యక్షుడిగా మీరు ఎదగలేకపోయారు. మీకు పాలన చేతకాదు. మీకు అధ్యక్ష పదవి ఒక రియాల్టీ షో మాత్రమే’’ అంటూ ఒబామా ఘాటు విమర్శలు చేశారు. ఇంత తీవ్రస్థాయిలో అధ్యక్షుల వారిపై విమర్శలు చేసిన ఒబామా వ్యాఖ్యలపై ట్రంప్ ఎలా స్పందిస్తారో చూడాలి.