Begin typing your search above and press return to search.

బ్రిటన్ దిగువ సభలో భగవద్గీతపై ప్రమాణం

By:  Tupaki Desk   |   18 Dec 2019 7:10 AM GMT
బ్రిటన్ దిగువ సభలో భగవద్గీతపై ప్రమాణం
X
హిందూమతానికి తమకు మించిన బ్రాండ్ అంబాసిడర్లు మరెవరూ ఉండరన్నట్లుగా మాట్లాడతారు కమలం పార్టీ నేతలు. మరి.. అలా మాట్లాడే నేతల్లో ఎంపీలుగా ఎన్నికై పార్లమెంటుకు వచ్చినోళ్లలో ఎంతమంది తమ ప్రమాణస్వీకారాన్ని భగవద్గీత మీద చేశారని ప్రశ్నిస్తే సమాధానం వెంటనే చెప్పలేని పరిస్థితి. హిందువులు పరమ పవిత్రంగా భావించే భగవద్గీత మీద ప్రమాణం చేసి తమ ప్రమాణస్వీకారాన్ని బీజేపీ ఎంపీలు ఎందుకు చేయలేదు? అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని పరిస్థితి.

కట్ చేస్తే.. తాజాగా బ్రిటన్ దిగువ సభకు ఎన్నికైన మనోళ్లు (భారతీయ మూలాలున్న వారు) తమ ప్రమాణస్వీకారం సందర్భంగా భగవద్గీత మీద ప్రమాణం చేసిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. హౌజ్ ఆఫ్ కామన్స్ లో ప్రమాణస్వీకారం చేసే సందర్భంలో భారత మూలాలున్న ఎంపీల ప్రమాణస్వీకారం కాస్త భిన్నంగా సాగింది.

భారత్ లోని ఆగ్రాలో పుట్టిన అలోక్ శర్మ తో పాటు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుు రిషి సునక్ లు ప్రమాణం చేసే సమయంలో చేతిలో భగవద్గీతను పట్టుకొన్నారు. తమకు నచ్చిన మతగ్రంధాన్ని పట్టుకొని ప్రమాణం చేసే వెసులుబాటు బ్రిటన్ లో ఉంది. ఒకవేళ అలాంటి ఇష్టం లేని వారు ఆత్మసాక్షిగా ప్రమాణస్వీకారం చేయొచ్చు. తాజాగా జరిగిన ఎన్నికల్లో బ్రిటన్ చరిత్రలోనే అత్యధికంగా 65 మంది శ్వేతజాతీయేతరులు విజయం సాధించారు. వీరిలో 15 మంది భారతీయులు కావటం గమనార్హం. సాధారణంగా మన పార్లమెంటులో అందునా.. బీజేపీ ఎంపీల కారణంగా కనిపించాల్సిన సీన్ బ్రిటన్ లో కనిపించటం ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.