Begin typing your search above and press return to search.

చర్యకు ప్రతిచర్య: పన్నీర్ పై వేటేసిన చిన్నమ్మ

By:  Tupaki Desk   |   8 Feb 2017 4:10 AM GMT
చర్యకు ప్రతిచర్య: పన్నీర్ పై వేటేసిన చిన్నమ్మ
X
తమిళనాడు రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ఇంతకాలం నోరువిప్పకుండా.. మౌనంగా.. విధేయుడి పాత్రను పోషించిన పన్నీర్ సెల్వం స్వరంమార్చారు. అమ్మ ఆత్మ ఆదేశించిందంటూ సంచలన వ్యాఖ్యలు చేయటమేకాదు.. అమ్మ ఆశలు.. ఆకాంక్షల్ని బయటపెట్టిన ఆయన.. అమ్మఆఖరి రోజుల్లోతన చేయి పట్టుకొని ఏం చెప్పారో చెప్పి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తటమేకాదు.. చిన్నమ్మకు భారీ షాకిచ్చారు.

‘‘నా అంతరాత్మ వేదనతో రగిలిపోతోంది. అందుకే దేశ ప్రజలకు.. పార్టీకార్యకర్తలకు కొన్ని నిజాలు చెప్పాలనుకుంటున్నా. అలా చేయాలని అమ్మ ఆత్మనాకు చెప్పింది. అనారోగ్యానికి గురైన అమ్మ తనకేమైనా జరిగితే తదుపరిముఖ్యమంత్రి పీఠాన్నిఅధిష్ఠించాలని నా చేతులు పట్టుకొని మరీ చెప్పారు. పార్టీప్రధాన కార్యదర్శిగా ప్రిసీడియం ఛైర్మన్ మధుసూదన్ ను ఎన్నుకోవాలని కోరాను.అందుకు నేను అంగీకరించలేదు. ఇప్పటికే రెండుసార్లు సీఎంగా ఉండటంతోపరజలు.. పార్టీ కార్యకర్తలు కోరుకునే ఒకరిని సీఎం పదవికి ఎన్నుకోవాలనిసూచించా. ఇతరులు ఎవరైనా సీఎంగా ఉంటే పార్టీకి.. పాలనకు భంగం కలిగేప్రమాదం ఉందని హెచ్చరించటంతో పదవిని చేపట్టేందుకు ఒప్పుకున్నా. ఈక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళను ఎన్నుకున్నాం. ముఖ్యమంత్రినిఅయ్యాక సీనియర్ మంత్రులు.. పార్టీ నేతలు పలు రకాలుగా అవమానించారు.నా స్థాయిని తగ్గించి చూశారు. అమ్మ మరణానంతరం పార్టీ ప్రతిష్ఠను..ప్రభుత్వాన్ని కాపాడటం నా విదిగా భావించా. నా ప్రయత్నాలకు వెన్నుపోటుపొడిచే ప్రయత్నాలు జరిగాయి’’ అంటూ ఓపెన్ అయిన పన్నీరు సెల్వంపైచిన్నమ్మకన్నెర్ర చేశారు.

ఆయన్నుపార్టీ కోశాధికారి పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.పన్నీర్ సంచలన వ్యాఖ్యల అనంతరం షాక్ తిన్న శశికళ.. పార్టీ ముఖ్యనేతలకుఫోన్ చేసి పోయెస్ గార్డెన్ కు పిలిపించుకున్నారు. వేద నిలయానికి చేరుకున్నసీనియర్ మంత్రులు.. పార్టీ నిర్వాహకులు పన్నీర్ సెల్వాన్ని పార్టీ నుంచిబహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే.. పార్టీ కోశాదికారి పదవినుంచి తప్పించిన చిన్నమ్మ.. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోవటంగమనార్హం. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే.. పన్నీర్ కు దాన్నో అవకాశంగా తీసుకునేఅవకాశం ఉండటంతో ఆయన్ను పార్టీ నుంచి కాకుండా పదవి నుంచి మాత్రమేతప్పించారని చెబుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో పన్నీర్ ఇంటివద్దకు ఆయన మద్దతు దారులు చేరుకున్నారు. మరోవైపు శశికళకువ్యతిరేకంగా పలువురు రోడ్ల మీదకు వచ్చి నినాదాలు చేశారు. దీనికి ప్రతిగా శశికళ మద్దతుదారులు రోడ్ల మీదకు రావటంతో పోటాపోటీ నినాదాలు మొదలయ్యాయి. తాజా పరిణామాలతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/