Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యే పరువు తీసిన టీఆరెస్ లేడీస్

By:  Tupaki Desk   |   1 Feb 2016 3:29 PM IST
ఎమ్మెల్యే పరువు తీసిన టీఆరెస్ లేడీస్
X
బీజేపీ ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్‌ వీఎస్‌ ఎస్‌ ప్రభాకర్‌ ఇటీవల తరచూ పరాభవాలు ఎదుర్కొంటున్నారు మొన్నటికి మొన్న సొంత పార్టీ నేతలే ఆయన కారును అడ్డుకుని గొడవ గొడవ చేశారు. ఇప్పుడు మహిళలు ఆయనపై తిరగబడ్డారు. గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో మీర్‌పేట్‌కు వెళ్లిన ఆయన అక్కడున్న టీఆర్ ఎస్ మహిళా నేతతో గొడవకు దిగారు. డబ్బులు పంచుతున్నారంటూ ఆమెతో వాదన పెట్టుకున్నారు. అక్కడితో ఆగకుండా ''ఇక్కడ మీకు ఒక్క ఓటు కూడా పడదు. ఇక్కడున్న ఆడోళ్లతోనే కొట్టిస్తా… తరిమి తరిమి కొట్టిస్తా'' అంటూ టీఆర్ ఎస్ మహిళా నేతకు వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఆ మహిళా నేతకూడా రెచ్చిపోయారు. ఆమె వెంట ఉన్న మహిళలు కూడా ప్రభాకర్ పై విరుచుకుపడి మమ్మల్నే కొట్టిస్తానంటావా అంటూ ఆయన్నే కొట్టినంత పనిచేశారు. ''మమ్మల్ని కొట్టిస్తావా..? రా.. కొట్టు.. ఎలా కొట్టగలవో చూస్తాం.. నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా'' అంటూ ఎమ్మెల్యే పరువు తీసి పందిరేశారు. దాంతో సీను తేడాకొడుతోందని అర్థం చేసుకున్న ఆయన మెల్లగా జారుకున్నారు.

కాగా గ్రేటర్ ఎన్నికల సందర్భంగా పలు డివిజన్లలో టీఆరెస్ నేతలు డబ్బు పంచుతున్నట్లుగా ఆరోపణలు మాత్రం పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. చాలామంది నేతలు నేరుగా డబ్బు ఖర్చు పెట్టేందుకు ఇష్టపడకుండా కాలనీల్లో పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు. టీఆరెస్ నేతలు మాత్రం ఈ పార్టీలతో పాటు క్యాష్ కూడా పంచుతున్నట్లు సమాచారం.