Begin typing your search above and press return to search.

నూతన్ నాయుడు భార్య మధు ప్రియా మళ్లీ అరెస్టు!

By:  Tupaki Desk   |   9 Oct 2020 9:30 AM IST
నూతన్ నాయుడు భార్య మధు ప్రియా మళ్లీ అరెస్టు!
X
విశాఖలో ఓ దళిత యువకుడి శిరోముండనం కేసులో బిగ్ బాస్ ఫేమ్, దర్శకుడు నూతన్ నాయుడిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నూతన్ నాయుడు భార్య మధు ప్రియాను కూడా ఇదే కేసులో అంతకుముందే అరెస్టు చేశారు. నిన్న ఆమెకు బెయిల్ లభించింది. విడుదలైన కొద్ది గంటల్లోనే ఆమెను పోలీసులు మళ్లీ అరెస్టు చేయడం గమనార్హం.

ఉద్యోగాలు ఇస్తామని చెప్పి డబ్బు తీసుకొని మోసం చేసిందని మధుప్రియపై తూర్పు గోదావరి జిల్లా నివాసి ఫిర్యాదుచేశారు. మధుప్రియ తన వద్ద రూ.25 లక్షల రూపాయలు తీసుకొని మోసం చేసిందని ఫిర్యాదు చేశారు. అక్టోబర్ 20 వరకు ఆమెకు రిమాండ్‌ విధిస్తూ కోర్టు ఆదేశించింది.

దళిత యువకుడికి శిరోముండనం చేసిన కేసు లో ఇప్పటికే నూతన్, మధుప్రియ ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఆ యువకుడి తలపై కూడా చితకబాదడంతో ఈ కేసు సీరియస్ అయ్యింది. దళిత యువకుడు శ్రీకాంత్ పెందూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నూతన్ నాయుడు ఇంటి నుంచి సిసిటివి ఫుటేజీని తీసుకొని విచారణ జరిపి జైలుకు పంపారు.

ఆ కేసు లో మధు ప్రియా, నూతన్ నాయుడుతో పాటు ఏడుగురిని రిమాండ్‌ కు పంపారు. తన భార్య మధుప్రియను విడిపించేందుకు కొందరు ఐఎఎస్ అధికారులు.. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల పేరుతో ఫోన్లు చేసి ప్రలోభ పెట్టడంతో నూతన్ నాయుడు పై కేసులు నమోదై అరెస్ట్ చేశారు.కాగా ఇప్పుడు మరో కేసులో ఆయన భార్య జైలు పాలు కావడం గమనార్హం.