Begin typing your search above and press return to search.

డేటింగ్ యాప్.. ఆ మహిళా ఎంపీకి షాకిచ్చింది

By:  Tupaki Desk   |   22 Sept 2020 11:45 AM IST
డేటింగ్ యాప్.. ఆ మహిళా ఎంపీకి షాకిచ్చింది
X
పార్లమెంట్ ఎంపీ, బెంగాల్ నటి నుస్రజ్ జహాన్ ఫొటోలను కొందరు డేటింగ్ యాప్ లో పెట్టడం కలకలం రేపింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అయిన నుస్రత్ జహాన్ అందుకు ముందు నటి. బెంగాల్ నటిగా ఎంపీగా ఫేమస్. తాజాగా ఆమెకు చేదు అనుభవం ఎదురైంది.

డేటింగ్ యాప్ లో తన ఫొటోను చూసి షాకైన ఎంపీ నుస్రత్ జహాన్ తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. డేటింగ్ యాప్ లో ఎంపీ నుస్రత్ జహాన్ ఫొటోను భస్వాతి అనే నెటిజన్ స్క్రీన్ షాట్ తీసి ట్వీట్ చేశారు. ఎంపీగా ఉన్న నుస్రత్ ఫొటోను వీడియో చాటింగ్ కోసం ఎలా వాడుతున్నారంటూ ఆమె ట్వీట్ లో పేర్కొంది.

ఈ విషయం నుస్రత్ దృష్టికి వెళ్లడంతో ఆమె తీవ్రంగా స్పందించారు. తన అనుమతి లేకుండా డేటింగ్, వీడియో చాటింగ్ యాప్ లో ఫొటో పెట్టారని.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎంపీ నుస్రత్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ను కోల్ కతా పోలీస్ కమిషనర్ అనూజ్ శర్మకు ట్యాగ్ చేశారు.

దీంతో పోలీసులు వెంటనే స్పందించి విచారణ చేపట్టి డేటింగ్ యాప్ పై చర్యలు తీసుకుంటామని ఎంపీ నుస్రత్ కు తెలిపారు.

మోడల్ అయిన నుస్రత్ బెంగాలీ సినిమాల్లో నటిగా రాణించారు. మమతా బెనర్జీ పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చి 2019 లో లోక్ సభ ఎన్నికల్లో పోటీచేశారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చి తృణమూల్ తరుపున 2019 లోక్ సభ ఎన్నికల్లో బసీర్ హాట్ నుంచి పోటీచేసి ఎంపీ అయ్యారు.